ఆర్థికంగా నష్టపోతున్నారా.. చేపట్టిన పనులు ఆలస్యం అయితే ఇలా చేయండి..!!

వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని నియమ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. హిందూ సాంప్రదాయం ప్రకారం నరదృష్టి కి ప్రత్యేకమైన పూజలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాంటి వాటిలో ఎండుమిరపకాయలు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాయి. మిరపకాయలు ఆహారానికి రుచిని తీసుకు రావడమే కాదు ఆహారానికి మంచి రంగును కూడా ఇస్తాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎండుమిర్చి ఉపయోగించి అనేక రకాల సమస్యలకు నివారణ కూడా చేయవచ్చు. ఇకపోతే శారీరక సమస్యలను దూరం చేయడమే కాదు నరదృష్టి వంటి సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు.

ముఖ్యంగా చేపట్టిన పనులలో అడ్డంకులు ఏర్పడుతూ ఉంటే ఈ అడ్డంకులను తొలగించడానికి 21 మిరపకాయలను తీసుకొని నీటిలో వేసి సూర్యునికి అర్ఘ్యం సమర్పించాలి. ఇలా వరుసగా 21 రోజులు పాటించాలి.. అంతే కాదు అర్ఘ్యం సమర్పించేటప్పుడు కూడా ఓం తుష్టాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. ఇలా చేస్తే మీ జీవితం లోని అన్ని సమస్యలు తొలగి పోవడమే కాకుండా మీరు చేపట్టిన పనులు కూడా సవ్యంగా సాగిపోతాయి. ఒక వస్త్రం లో ఏడు మిరపకాయలను బట్టి మీ వద్ద ఉంచుకోవాలి. ప్రతి వారం మిరపకాయలను మారుస్తూ ఉండాలి . ఇక ఏదైనా పని , వివాహం లో వచ్చే అడ్డంకులను తొలగించడానికి ఇది చాలా బాగా సహాయపడుతుంది.

ఇక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లయితే ఒక గిన్నెలో ఎండు మిరపకాయలు తీసుకొని.. అందులో పటిక బెల్లం,  నల్లనువ్వులు వేయాలి. రోగి వద్ద ఉంచాలి. ఇలా చేయడం వల్ల చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ వైబ్రేషన్స్ ప్రవేశిస్తాయి. వ్యాపారంలో ఆర్ధిక నష్టం వస్తున్నట్లయితే ఒక కుండలో నీటిని నింపి అందులో 7 మిరపకాయలను వేయాలి. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు ప్రధాన ద్వారం ఆ కుండ వద్ద ఉంచాలి . నీరు, మిరపకాయలను క్రమం తప్పకుండా మారుస్తూ వుంటే కచ్చితమైన  ప్రయోజనాలు కలుగుతాయి.