సూర్య గ్రహణం తర్వాత వీటిని దానం చేస్తే.. లక్ష్మీదేవి మీ చెంతే..!!

ఏప్రిల్ 30 2022 వ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం శనివారం రోజున అది కూడా అమావాస్య రోజున జరగబోతోంది. ఇక ఈ సూర్యగ్రహణం 30వ తేదీ మధ్యాహ్నం 12:15 గంటల నుండి మరుసటి రోజు సాయంత్రం 4 :07 గంటల వరకు సూర్యగ్రహణం ఉంటుంది. ఇక ఈ నేపథ్యంలో మే 1వ తేదీన ఉదయం స్నానం చేసిన తర్వాత మీ రాశిని బట్టి కొన్ని వస్తువులను దానం చేయడంవల్ల గ్రహదోషాలు తొలగిపోతాయి. ఇంట్లో ధనధాన్యాలు వృద్ధి చెందుతాయి. ఇకపోతే సూర్య గ్రహణం తర్వాత ఏ రాశివారు ఎలాంటి వస్తువులను  దానం చేయాలి అనే విషయం కూడా తెలుసుకుందాం.

1. మేష రాశి:
ఈ రాశివారు ధాన్యాలు ఎర్రటి వస్త్రాలు, పప్పు, బెల్లం వంటివి దానం చేయాలి.

2. వృషభ రాశి:
పాలు, కీర్, పెరుగు ,పంచదార , అన్నం, తెల్లటి వస్త్రాలు, కర్పూరం మొదలైనవాటిని దానం చేయాలి.

3. మిధున రాశి:
ఆవుకు పచ్చగడ్డి తినిపించాలి . ఇక ఆకుపచ్చ బట్టలు,  ఆకుపచ్చ కూరగాయలు,  ఆకుపచ్చ పప్పు,  కంచు పాత్రలు మొదలైనవాటిని దానం చేయాలి.

4. కర్కాటక రాశి:
బ్రాహ్మణుడికి తెల్లటి వస్త్రాలు,  ముత్యాలు, పంచదార, పాలు లేదా పాలతో తయారుచేసిన స్వీట్లూ, అన్నం దానం చేయాలి.

5. సింహరాశి:
బ్రాహ్మణుడికి బెల్లం , గోధుమలు,  రాగి పాత్రలు, ఎరుపు లేదా నారింజ రంగు దుస్తులు మొదలైనవాటిని దానం చేయాలి.

6. కన్యారాశి:
పచ్చిమేత,  పచ్చ వస్త్రాలు , పచ్చటి కూరగాయలు వంటి వాటిని దానం చేయాలి.

7. తులారాశి:
తెల్లటి వస్త్రాలను అలాగే తెల్లటి వస్తువులను దానం చేయడం వల్ల ధన వృద్ధి కలుగుతుంది.
8. వృశ్చిక రాశి:
ధాన్యాలు , ఎర్రటి వస్త్రాలు,  బెల్లం , పప్పు తదితర వాటిని దానం చేయాలి.

9. ధనస్సు రాశి:
ఈ రాశివారు పసుపు రంగు దుస్తులను దానం చేయాలి. అలాగే శెనగపిండి, పసుపు, కుంకుమ, బెల్లం మొదలైనవాటిని దానంగా ఇవ్వచ్చు.

10. మకర రాశి:
ఈ రాశివారు దువ్వెన, నలుపు రంగు బట్టలు, గొడుగు, నీలం రంగు బట్టలు ఆవాల నూనె, నువ్వుల నూనె వంటివి దానం చేయాలి.

11. కుంభ రాశి:
ఈ రాశివారు కూడా దువ్వెన, నలుపు రంగు బట్టలు, గొడుగు, నీలం రంగు బట్టలు ఆవాల నూనె, నువ్వుల నూనె వంటివి దానం చేయాలి.

12. మీన రాశి:
ఈ రాశివారు బెల్లం శనగ పప్పు పసుపు వస్త్రాలను దానం చేయాలి.

ప్రతి ఒక్కరి ఇంట్లో ధనధాన్య అభివృద్ధి జరగాలి కాబట్టి అందరికీ ఆర్టికల్ను వాట్స్అప్ ద్వారా షేర్ చేయండి.