sani dosham : శని దోషం తొలగి పోయి.. ఆర్థికాభివృద్ధి పెరగాలి అంటే ఏం చేయాలో తెలుసా..

sani dosham :సాధారణంగా ప్రతి రెండున్నర సంవత్సరాలకొకసారి శని భ్రమణం చేస్తూనే ఉంటారు. అయితే కర్మానుసారముగా ఫలితాలను అందిస్తాడు అని తెలిసినప్పటికీ.. చాలామందికి ఇప్పటివరకు నష్టాన్ని కలిగించాడు అని ఎంతోమంది వాపోతున్నారు. ఇకపోతే రాశి చక్రం లోకి శని ప్రవేశించాడు అంటే ఒక సారి అదృష్టం కలిసి వస్తుంది లేదా మరొకసారి నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. అయితే ఒకసారి శని యొక్క చెడు ప్రభావం మన మీద పడింది అంటే ఇక అక్కడి  నుంచి తప్పించుకోవడం అంత సులువు కాదు. కానీ వాటి నుంచి తప్పించుకునేందుకు మాత్రం కొన్ని పరిష్కారాలు ఉన్నట్లుగా కొంతమంది పండితులు తెలియజేస్తున్నారు. చివరిసారిగా అందులో శక్తివంతమైన వాటిలో ఎక్కువగా లక్ష్మీ నరసింహ స్వామి ని పూజించడం అని పండితులు తెలియజేస్తున్నారు. ఈ స్వామిని దర్శించడం వల్ల ఏలినాటి శని కూడా పోతుందని తెలియజేశారు. అయితే అవి ఏ ఏ దేవాలయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం.

1). జ్వాలా నరసింహస్వామి దేవాలయం:
ఇది తెలంగాణలో యాదగిరిగుట్ట గా పిలువబడుతుంది. ఇక్కడికి కుజదోషం ఉన్నవారు వెళ్లి నరసింహ స్వామి ని దర్శించు కోవచ్చు.

2). అహోబిలం:
ఇది ఆంధ్ర ప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో కలదు. ఇక్కడ గురు గ్రహ శని ఉన్న వారు ఇక్కడికి వెళ్లి నరసింహ స్వామిని దర్శించుకోవడం వల్ల  వాటి నుంచి విముక్తి పొందవచ్చు.

3). మాలోల నరసింహస్వామి:
ఇది కూడా అహోబిలానికి  ఒక కిలో మీటర్ దూరంలో ఉన్నది. దీనిని దర్శించుకోవడం వల్ల శుక్రగ్రహ దోషాలు తొలగిపోతాయట.

4). వరాహ నరసింహస్వామి:
ఇది కూడా అహోబిలం  నుంచి కాస్త దూరంలో ఉన్నది.. రాహు గ్రహ శని నుంచి విముక్తి పొందవచ్చు.

5). కారంజ నరసింహస్వామి:
చంద్రగ్రహ దోషాలు ఉన్నట్లయితే ఈ స్వామిని దర్శించి నట్లయితే అవి తొలగిపోతాయి.

6). యోగ నరసింహస్వామి:
ఈ నరసింహస్వామిని కూడా శని గ్రహం ఉండే వారు దర్శించడం వల్ల దోషాలు తొలగిపోయి సుఖసంతోషాలు జీవిస్తారు.

7). పావన నరసింహ స్వామి:
బుధ గ్రహాల శని ఉన్నట్లు అయితే ఈ స్వామిని దర్శించడం వల్ల వాటి నుంచి విముక్తి పొందవచ్చు. ఇది అహోబిలం నుంచి 6 కిలోమీటర్ల దూరంలో దక్షిణం వైపుగా ఉన్నది.

8). భార్గవ నరసింహస్వామి:
సూర్య గ్రహ శని దోషాలు ఉంటే ఈ లక్ష్మీనరసింహస్వామిని పూజించడం వల్ల వాటి నుంచి విముక్తి పొందవచ్చు.

9). చత్రవట నరసింహస్వామి:
కేతు గ్రహం శని దోషం ఉంటే..అలాంటివారు ఈ స్వామిని పూజించడం మంచిదట.

ప్రతి ఒక్కరికీ ఉపయోగపడే ఈ ఆర్టికల్ ను వాట్సాప్ ద్వారా అందరికీ షేర్ చేయండి.