Temple : ఎన్నో పురాతన చారిత్రక కట్టడాలకు పుట్టినిల్లు భారతదేశం. ఇక ఇండియాలోనే హిందు, ముస్లిం, క్రిస్టియన్ ఇలా ఎంతోమంది ఎన్నో దేవాలయాలను కూడా నిర్మించుకున్నారు. అది కూడా మన భారతదేశంలో ఉండేటటువంటి హిందూ దేవాలయాలను లెక్కబెట్టడం చాలా కష్టం. ఎందుచేతనంటే లెక్కపెట్టలేనన్ని గా ఉన్నట్లు సమాచారం. అయితే ప్రపంచంలో కెల్లా అతి పురాతనమైన పెద్ద హిందూ దేవాలయం కట్టడం ఎక్కడ ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఇక అతిపెద్ద దేవాలయం కంబోడియాలోని ఆంగ్ కోర్ లో ఉన్నది. ఆలయంలో శ్రీ మహావిష్ణువు కొలువుతీరాడు. ఇక అందుచేతనే ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందినది. ప్రపంచంలోకెల్లా మొదటి పురాతనమైన దేవాలయం గా చరిత్రలో నిలిచింది. ఇక ఈ ఆలయాన్ని నిర్మించింది పన్నెండవ శతాబ్దం లోని సూర్యవర్మ అనే ఒక రాజు
అయితే ఈ ఆలయం మొత్తం హిందువుల పద్ధతిలో కాకుండా.. క్మేర్ వారి పద్ధతులలో నిర్మించడం జరిగిందట. కానీ అందులోని శిల్పకళానైపుణ్యం మాత్రం మన భారతదేశ సంప్రదాయం ప్రకారం గా జరిగినట్లుగా అక్కడి పురాతన చరిత్ర తెలియజేస్తున్నాయి. అక్కడక్కడ మాత్రం తమిళ వాసులు నిర్మించిన ఆలయాలు ఉన్నటువంటి శైలి కనపడుతుంది.
ఈ ఆలయంలో ముఖ్యంగా.. మన పురాతన ఇతిహాసాలకు సంబంధించి కొన్నిటిని అక్కడ గుడి ప్రాంగణంలో చెక్కడం వల్ల బాగా ఆకట్టుకుంటోందట. శ్రీమహావిష్ణువు కొలువుదీరిన ఈ దేవాలయం 200 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కలదు. ఈ ఆలయాన్ని నిర్మించడానికి దాదాపుగా 30 సంవత్సరాల కాలం పట్టినట్లుగా సమాచారం. అయితే ఎక్కడైనా సరే నీళ్లు పైనుంచి కిందికి వస్తాయి.. కానీ ఇక్కడ మాత్రం నీరు కింది నుంచి పైకి ప్రవహిస్తూ ఉంటుందట. కానీ ఇలా ఎందుకు అవుతుంది అనే విషయం మాత్రం ఎవరూ కనిపెట్టలేకపోయారు. ఇక అక్కడి ప్రాంతంలోని జాతీయ జెండా పై దేవాలయం స్థానం లభించింది. ఇక ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.