Alekhya Reddy : యువగళం పాదయాత్రలో నందమూరి తారకరత్న పడిపోవడంతో లైమ్ లైట్ లోకి వచ్చింది.. అయినా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు వార్తలు రావడం మనందరికీ తెలిసిందే.. కాగా ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటపడిందని త్వరలోనే రికవరీ అవుతారని వైద్యులు చెబుతున్నారు. దాంతో నందమూరి తారకరత్న పర్సనల్ లైఫ్ గురించి నేటిజన్స్ సెర్చ్ చేస్తున్నారు.. అందులో భాగంగా అలేఖ్య రెడ్డి గురించి నెటిజన్స్ ఆరా తీస్తున్నారు..
అలేఖ్య రెడ్డి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరదలు కూతురు.. ఆమెనే భారతరత్న ప్రేమించే వివాహం చేసుకున్నారు. చల్లా రామచంద్ర రెడ్డికి తారకరత్నతో పార్టీ పరమైన సంబంధమే కాదు. బంధుత్వం కూడా ఉంది. తారకరత్న పెళ్లి చేసుకున్న అలేఖ్య రెడ్డి మరెవరో కాదు.. చల్లా రామచంద్రారెడ్డి పెద్దమ్మ కూతురే అలేఖ్య రెడ్డి కావడం గమనార్హం.
తారక రత్న అలేఖ్య రెడ్డిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే అలేఖ్య రెడ్డికి తారకరత్నతో మొదటి వివాహం కాదట. ఆమెకు అంతకుముందే మరో వివాహం జరిగింది. అలేఖ్య మొదటి వివాహాన్ని టిడిపి మాజీమంత్రి ఎలిమిరెడ్డి మాధవరెడ్డి కుమారుడు సందీప్ రెడ్డి తో జరిగింది . సందీప్ రెడ్డిని పెళ్లి చేసుకున్న కొంతకాలం తరువాత అలేఖ్య రెడ్డికి తన భర్తకి వైవాహిక జీవితంలో సమస్యలు ఎదురయ్యాయి. దాంతో ఇద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారు . దాంతో అలేఖ్య రెడ్డి కొంతకాలం ఒంటరిగా ఉంది.
ఆ తరువాత నందమూరి తారకరత్న నందీశ్వరుడు సినిమాలో ఆమె కాస్టింగ్ డిజైనర్ గా పనిచేశారు. వారిద్దరి మధ్య ఏర్పడిన ప్రేమ పెళ్లి వరకు తీసుకెళ్లింది. తారకరత్న కుటుంబ సభ్యులను ఎదిరించి అలేఖ్య రెడ్డిని పెళ్లి చేసుకున్నారు. 2012లో ఆగస్టు 2వ తేదీన సంఘీ టెంపుల్లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. తారకరత్న, అలేఖ్య రెడ్డికి జీవితం ఎంతో అన్యోన్యంగా ఉంది. వారికి ఒక కూతురు కూడా ఉంది..