Anchor Suma : అట్టర్ ఫ్లాప్ గా మారిన టాప్ యాంకర్ సుమ – కారణం ఇదే ?? జ్యోతిష్యుడు ఎప్పుడో చెప్పాడు !

Anchor Suma :  యాంకర్ గా బుల్లితెరను నాలుగు దశాబ్దాలకు పైగా సుమ ఏలుతుంది.. మకుటం లేని మహారాణి లాగా బుల్లితెరను ఏలేస్తుంది.. కానీ ఇటీవల సుమ యాంకరింగ్ గాడి తప్పుతుందని నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.. అందుకు కారణాలు కూడా బోలెడు ఉన్నాయి..

Suma anchoring is not good trolls and astrologer says
Suma anchoring is not good trolls and astrologer says

కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ మాట్లాడే ముందు యాంకర్ సుమ అందరికీ చెప్పినట్టుగానే.. ఎన్టీఆర్ కి కూడా ఇంట్రడక్షన్ చెప్పింది. కాగా ఆ చెప్పడంలో కొంచెం తేడా కొట్టింది. దానికి ఎన్టీఆర్ చాలా సీరియస్ అయ్యారు. తన సొంత కుటుంబం గురించి కానీ పర్సనల్ కానీ పట్టించుకోని అభిమానులు ఇప్పుడు ఎన్టీఆర్ 30 గురించి చాలా ఆత్రుతగా ఉచ్చుకతో ఎదురుచూస్తున్నారు అని చెప్పేసరికి.. ఎన్టీఆర్ కి ఎక్కడలేని కోపం వచ్చింది.. సుమా వచ్చి మైక్ ఎన్టీఆర్ కి ఇవ్వగానే.. వాళ్ళు అడిగారు లేదో కానీ నువ్వే అన్ని చెప్పేటట్టు ఉన్నావు అని ఎన్టీఆర్ సుమకి చిన్నపాటి పంచ్ ఇచ్చాడు.. దాంతో సుమ ఇది వినినట్టుగా ఉండిపోయింది..

కొద్ది రోజుల క్రితం రాజమౌళి పాల్గొన్న ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లను మహేష్ 29వ సినిమా గురించి మాట్లాడి ఆగ్రహానికి గురైంది. గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరు స్పీచ్ లో కూడా సుమా కల్పించుకుంది.. ఇక కొన్ని రోజుల ముందు వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్ లో రచ్చ రవి ఎమోషనల్ గా మాట్లాడుతుంటే.. సుమా దాన్ని కాస్త పక్కదారి చేయడంతో కాస్త విమర్శల బారిన పడిందనే చెప్పాలి..

వరుసగా సుమ ఇలా వివాదాలతో చిక్కుకోవడం వలన యాంకరింగ్ శృతి తప్పుతుందని పలువురు నెటిజన్స్ చెప్పుకుంటున్నారు.. ఇలా జరిగినా కూడా సుమా అంటే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ గౌరవిస్తూనే ఉంటారు. ఎక్కడ వల్గారిటీ లేకుండా కార్యక్రమాన్ని సజావుగా నడిపించడంలో సుమని మించిన వారు మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు.‌ అయితే సుమ కి ప్రస్తుతం అష్టమ శని నడుస్తుందని అందుకే ఇలాంటి ట్రోల్స్ తప్పడం లేదు.. కానీ ఇటీవల ఓ జ్యోతిష్యుడు చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..