Pawan Kalyan : భారీ మ్యాటర్ బయట పడింది : పవన్ కళ్యాణ్ మొదటి భార్య గురించి !

Pavan Kalyan first wife nandini full details
Pavan Kalyan first wife nandini full details

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు. మరోవైపు జనసేన పార్టీని స్థాపించి రాజకీయాల్లోనూ ఎంతో చురుగ్గా పాల్గొంటున్నారు. రాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఆయన నేను విమర్శించే క్రమంలో మూడు పెళ్లిళ్ల విషయం బాగా హైలైట్ చేస్తున్నారు ప్రతిపక్షాల వారు..

అలాగే పవన్ కళ్యాణ్ అన్ స్టాపబుల్ కార్యక్రమానికి హాజరైన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి ప్రస్తావన వచ్చింది. అసలు నేను పెళ్లి చేసుకోకూడదు అనుకున్నానని.. కానీ మూడు పెళ్లిళ్లు జరిగాయి అంటూ పవన్ కళ్యాణ్ తెలిపారు. రాజకీయంగా ఎలాంటి అవినీతి లేనటువంటి పవన్ కళ్యాణ్ ను ప్రస్తుతం అధికారపక్ష నేతలు తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతూ తనని టార్గెట్ చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ 1997 వ సంవత్సరంలో మొదటిసారి కుటుంబ సభ్యుల సమక్షంలో నందిని అనే అమ్మాయిని అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు.. 10 సంవత్సరాలపాటు వీరి దాంపత్యం అన్యోన్యంగా కొనసాగింది. వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు.. 2007వ సంవత్సరంలో పవన్ కళ్యాణ్ నందిని కి విడాకులు ఇచ్చి నటి రేణు దేశాయ్ ను పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఆమెకు కూడా విడాకులు ఇచ్చేసి అన్నా లెజ్నోవా ను పెళ్లి చేసుకున్నారు.

అయితే పవన్ కళ్యాణ్ మొదటి భార్య నందిని ప్రస్తుతం ఏం చేస్తుంది.. ఎక్కడ ఉంది అని నెటిజెన్లు సెర్చ్ చేస్తున్నారు.. 2007వ సంవత్సరంలో నందిని పవన్ కళ్యాణ్ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత ఆమె పేరును జాహ్నవిగా మార్చుకున్నారు. 2010వ సంవత్సరంలో నందిని కృష్ణారెడ్డి అనే డాక్టర్ ను పెళ్లి చేసుకుని అమెరికాలో స్థిరపడ్డారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె తన భర్త పిల్లలతో ఎంతో సంతోషంగా ఉన్నారని సమాచారం.