Anchor Suma : యాంకర్ సుమ అంటే తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులుండరు.. సుమ అంటే అంత పాపులర్.. బుల్లితెర మహారాణి.. స్మాల్ స్క్రీన్ పై ఆమె ఓ మెగాస్టార్. ఎంత పెద్ద షో అయిన ఏ మాత్రం బెదరకుండా తన మాటలతో అందరినీ ఆకట్టుకుంటుంది. సుమ మలయాళీ అమ్మాయి అయినా తెలుగింటి కోడలై.. అచ్చ తెలుగు అమ్మాయి మాటలతో మైమరిపిస్తుంది. సుమ ఏ ప్రోగ్రాం చేసిన అది హిట్ అవుతుంది..
తన మాటలతో గానీ చేతలతో గానీ ఎవరనీ నోప్పించని సుమ ఓ వైపు యాంకరింగ్ చేస్తూనే మరోపక్క ఓ సినిమాలలో నటించిన సంగతి తెలిసిందే. సుమ ఇటీవల జయమ్మ పంచాయతీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా విడుదల తర్వాత యాంకర్ సుమను జయమ్మ అని పిలవడం మొదలుపెట్టారు ఫ్యాన్స్. అయితే ఆ సినిమా అనుకున్నంత స్థాయిలో విజయం కాలేకపోయింది. ఆ సినిమా ఫలితం ఎలా ఉన్నా సినిమాలో సుమా క్యారెక్టర్ కు మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా ఓ ప్రముఖ నిర్మాత తన బ్యానర్ సుమను నటించమని అడిగారట. కానీ సుమ మాత్రం అందుకు నో చెప్పినట్లు సమాచారం. అయితే ఈ నిర్ణయం తన భర్త రాజీవ్ కి కూడా చెప్పకుండానే డెసిషన్ తీసుకుందట. నిజానికి మరొకరు అయితే ఆఫర్లు అసలు వదులుకోరు కానీ సుమ మాత్రం ఆఫర్ ని రిజెక్ట్ చేయడంతో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి..
సుమ పూర్తికే బుల్లితెరకి అంకితం అవ్వాలని డిసైడ్ అయిందని.. సినీ ఇండస్ట్రీలో ఆమె కంటూ గుర్తింపు ఉంది సినిమాలు చేసి దాన్ని పాడు చేసుకోవడం ఇష్టం లేక తాజాగా వచ్చిన ఆఫర్లు రిజెక్ట్ చేసిందని మరికొందరు అనుకుంటున్నారు.. ఈ వార్తలో నిజం ఎంత ఉందో తెలియదు గానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ న్యూస్ చెక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం సుమకు ఏ రేంజ్ లో డిమాండ్ ఉందో మనందరికీ తెలిసిందే. పెద్ద పెద్ద స్టార్ హీరోలు సైతం వారి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి సుమనే యాంకర్ గా సెలెక్ట్ చేస్తున్నారు. ప్రోగ్రాం ఏదైనా సరే సుమ సక్సెస్ చేసేస్తుంది. అది తనకున్న పాపులారిటీ. అందుకే వెండి తెరకు వెళ్లాలని అనుకోవడం లేదట.