Sri Leela : పెళ్లి సందD సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది యంగ్ బ్యూటీ శ్రీలీల.. రవితేజ నటించిన ధమాకా సినిమాలో హీరోయిన్ గా నటించి మెప్పించింది. రవితేజ కెరీర్ లో ఈ సినిమా 100 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది.. దాంతో ఈ అమ్మడిని బాక్సాఫీస్ దేవతగా కొలుస్తున్నారు. ఈ అమ్మడు అందం అభినయంతో పాటు కూడా అద్భుతంగా చేస్తుంది.. దాంతో ఈ అమ్మడుని యంగ్ హీరోలే ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు..
ప్రస్తుతం శ్రీ లీలా చేతిలో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. నందమూరి బాలకృష్ణ – అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రంలో నటించబోతున్న శ్రీలీల, రామ్ పోతినేని- బోయపాటి కాంబినేషన్ సినిమాలోనూ హీరోయిన్‌గా చేస్తోంది. నితిన్, పంజా వైష్ణవ్ తేజ్ సినిమాలకీ శ్రీలీల సంతకం చేసింది. SSMB28 సినిమాలో కూడా శ్రీలీల నటిస్తుంది.
ఇప్పుడు ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.. శ్రీలీల నిత్యం తనకు సంబంధించిన ఫోటోలను, సినిమా అప్డేట్లను పంచుకుంటూ ఉంటుంది.ఇక చూడటానికి చాలా అందంగా ఉండే ఈ ముద్దుగుమ్మకు కుర్రాళ్ళు ఫిదా అవుతూ ఉంటారు.
హీరోయిన్ శ్రీ లీల నటిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నప్పటికీ.. వృత్తిపరంగా ఈమె కూడా వైద్య విద్యను అభ్యసించింది.. ఈ సంవత్సరం శ్రీ లీల డాక్టర్ పట్టా కూడా అందుకోబోతున్నారు. ఇలా ఈమె కూడా వైద్య విద్యను అభ్యసించి ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగారు. ఇలా రాజశేఖర్ మాదిరిగానే ఈమె కూడా డాక్టర్ చదువు చదివి ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగడమే వీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్.. అయితే శ్రీ లీల మాత్రమే కాకుండా ఇండస్ట్రీలో పలువురు సెలబ్రిటీలు కూడా వైద్యవృత్తిని అభ్యసించి సెలబ్రిటీలుగా కొనసాగుతున్నారు. శ్రీ లీల ప్రస్తుతం బరుత సినిమా వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు..