Mother Twist : పెళ్లి అయ్యి కొడుకు ఉన్నా కూడా ఒక తల్లి ఇలా చేస్తుంది అని నమ్మలేని కథ ఇది !

Mother Twist  : ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ లో డాక్టర్ ఓం ప్రకాష్ అనే అతను ఉండేవాడు. తన తల్లి తన ఇద్దరు తమ్ముళ్ళతో ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నాడు. ఓం ప్రకాష్ అనే వ్యక్తి కి మొదటి భార్య నుంచి విడాకులు తీసుకోవడంతో తనకి రెండో పెళ్లి చేశారు కుటుంబ సభ్యులు. తన రెండో భార్య పేరు అర్చన యాదవ్. ఓం ప్రకాష్ అర్చన ఇద్దరూ కొన్నాళ్లపాటు ఎంతో అన్యోన్యంగా ఉన్నారు .వీళ్ళకి ఒక బాబు కూడా పుట్టాడు..

ఆ తరువాత ఉమ్మడి కుటుంబంలో నుంచి వేరు పడదామని అర్చన తన భర్తని అడిగింది. భర్త ససిమేరా ఒప్పుకోలేదు తన అన్నదమ్ములతో అమ్మ వాళ్ళతో కలిసి ఉండాలని అన్నాడు. దాంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు అయ్యేవి.. ఇద్దరి మధ్య కాస్త ఎడబాటు మొదలైంది. అయితే అదే ఇంట్లోనే కలిసి ఉంటూ మనం వేరుగా వంట చేసుకుని తిందాం అని ఆలోచనకి ఒప్పుకుంది అర్చన. ఇంట్లో అందరి పని తగ్గడంతో అర్చన కాస్త ఖాళీ సమయం అంతా సోషల్ మీడియా లోనే గడిపేది. అర్చన యాదవ్ ఎప్పుడు చూసినా ఫోన్లో మాట్లాడడం గమనించాడు ఓం ప్రకాష్.

 

అర్చనకి సోషల్ మీడియా ద్వారా ఫేస్ బుక్ నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాడు అజయ్. అలా వారికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరు ఒకసారి కలుసుకోవాలనుకున్నారు. అలా అర్చన యాదవ్ తన పుట్టింటికి వెళ్ళిన లక్నో వెళ్ళింది. తన పుట్టింటిలో ఎవరూ లేకపోవడంతో అదే ఇంట్లో మొదటిసారి అజయ్ ను కలుసుకుంది. ఆ మొదటి రోజే వారిద్దరి మధ్య శారీరక సంబంధం కూడా ఏర్పడింది. ఆ తరువాత తరచుగా అర్చన యాదవ్ తన పుట్టింటికి వెళ్తూ ఉండేది.   అక్కడ ఇంట్లో ఎవరూ లేని సమయంలో అజయ్ యాదవ్ పిలిపించుకొని ఇద్దరు ఏకాంతంగా గడిపేవారు. అక్కడే కాకుండా ఇంట్లో కూడా ఎవ్వరూ లేని సమయంలో అజయ్ తో ఏకాంతంగా గడిపేది. ఒకరోజు అర్చనా అజయ్ తో ఇద్దరి మధ్య మన భర్త అడ్డుగా ఉండకూడదని తన భర్తను చంపేయమని సలహా ఇస్తుంది. అర్చన యాదవ్ మాటలకు సరే అంటాడు అజయ్.

ఓం ప్రకాష్ కుటుంబం అంతా కలిసి ఒకరోజు ఏదో ఫంక్షన్ కి వెళ్తారు. ఆ ఫంక్షన్ కి అర్చన యాదవ్ వెళ్ళదు. అప్పుడే అజయ్ తో ఇంటికి పిలిపించి తనతో ఏకంగా గడుపుతుంది. ఇంట్లో వాళ్ళు తిరిగి ఇంటికి వచ్చేసరికి అజయ్ ని తన బెడ్ రూమ్ లోనే దాచిపెడుతుంది.. అది ఇంట్లో ఎవ్వరికీ తెలియకుండా.. ఇక ప్లాన్ ప్రకారం ఆరోజు రాత్రి తన భర్త ను చంపేయాలని అర్చనా యాదవ్ అజయ్ తో కలిసి ప్లాన్ చేస్తుంది. ఓం ప్రకాష్ తన కొడుకు ఇద్దరూ కలిసి మరొక బెడ్ రూమ్లో నిద్రపోతూ ఉంటారు. అర్చన అజయ్ ఇద్దరు చేతిలో సుత్తి పట్టుకొని ఓం ప్రకాష్ మీద దాడి చేస్తారు. మూడు దెబ్బలకే అతను చనిపోతాడు. దాంతో పక్కనే ఉన్న అర్చన కన్న కొడుకు నిద్ర లేస్తాడు. ఆ పిల్లవాడు ఎక్కడ సాక్ష్యం చెప్పి ఇద్దరినీ పోలీసులు అప్పగిస్తాడేమోనని భయపడింది.. తన పిల్లవాడిని కూడా చంపేయమని అర్చన అజయ్ తో చెప్పింది..

మన ప్లాన్ లో పిల్లాడిని చంపడం లేదని.. నేను ఆ పిల్లవాడిని చంపనని అజయ్ చెప్పాడు. నువ్వు చంపకపోతే నా కొడుకుని నేనే చంపేస్తానని గొంతు నులిమి చంపేసింది అర్చన యాదవ్.. ఇక తనని కూడా గదిలో బంధించి ఎవరో దుండగులు వచ్చి ఇదంతా చేశారని డ్రామా క్రియేట్ చేయమని అజయ్ యాదవ్ తో చెబుతుంది. ఇక దాంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎవరో తన బయటి వారు ఓం ప్రకాష్ ను చంపేశారని అంతా అనుకున్నారు.

కానీ ఓం ప్రకాష్ అన్నయ్య పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తాడు. అర్చన యాదవ్ ఫోన్ ని కాల్ డేటా ని తీయగా.. తను ఎవరితోనో మాట్లాడుతుందని తెలుసుకున్నాడు . అజయ్ ను పోలీస్ స్టేషన్కు పిలిచి విచారించాడు. ఇక అర్చన యాదవ్ ని కూడా పోలీస్ స్టేషన్ కి పిలిపించి అజయ్ నీ గురించి తమకు అంతా నిజం చెప్పేశాడని చెబుతాడు. దాంతో అర్చన కూడా ఏం జరిగిందో చెప్పి లొంగిపోతుంది.. ఈ కథలో కన్నతల్లి కొడుకుని చంపడం చాలా బాధాకరం. ఇక కోర్టు విచారణలో అజయ్ యాదవ్, అర్చన యాదవ్ కి జీవిత ఖైదు శిక్షలు విధించారు.