Kritimohan Story : కన్నీళ్లు పెట్టించే ఈ అమ్మాయి కష్టం ఏ ఆడపిల్లకి రాకూడదు..

Kritimohan Story  కేవలం డబ్బు ఆశ తో ఇద్దరు రాక్షసులు ఓ అమ్మాయి జీవితంలోకి వచ్చారు.. ఒకరు డబ్బులు రావని విడుకులు ఇచ్చి వదిలేశాడు.. మరొకడు డబ్బులు ఇవ్వకపోవడంతో ఆమె ప్రాణమే తీశాడు.. కృతి మోహన్ ఈమెది కేరళ రాష్ట్రం కొల్లం జిల్లా మలవాన.. ఆమె తండ్రి మోహన్ ప్రభుత్వ ఉద్యోగి . తల్లి బ్యూటీషియన్. ఒక్కగానొక కూతుర్ని ఎంతో ప్రేమగా పెంచుకున్నారు. ఉన్నత చదువులు చదివించారు. అన్నీ ఉన్నా కొంతమంది దురదృష్టవంతులు అవుతారు వారిలో కృతి కూడా ఉన్నారు. ఆమె పుట్టిన దగ్గరి నుంచి ఎప్పుడు కష్టపడలేదు. అన్ని ఆమె ముందే ఉండేవి. పైగా ఆమె సినిమా హీరోయిన్ అంత అందంగా కూడా ఉంటుంది. డబ్బులకి కొదవలేదు.. కానీ కృతి జీవితం పెళ్లి తర్వాత తిరగబడిపోయింది..

ఎంతో అందంగా ఉండే కృతిని ఒక వ్యక్తి ప్రేమిస్తున్నాను అని వెంటపడ్డాడు అతను దూరపు బంధువు కావడంతో కృతి తండ్రి మోహన్ కూడా సరే అన్నాడు. 20 ఏళ్లకే పెళ్లి చేసి కృత్తిని అత్తవారింటికి పంపాడు తనకి నరకం చూపించాడు. డబ్బులు కావాలని ఆస్తులు రాసి ఇవ్వాలని పేచీ పెట్టాడు. అది కూడా ఆమె గర్భవతి అయ్యాక తనలోని మరో రాక్షసుడిని చూపించాడు. దాంతో కృతి మొదటి భర్తకు విడాకులు ఇచ్చేసి తన పుట్టింట్లో తన పాపతో ఉంటుంది. ఇక రెండో పెళ్లి చేస్తే చేసుకోనని ఇంట్లో వాళ్లకి తెగేసి చెప్పింది కానీ బంధువులు మాటలు విన్న తన తండ్రి కృతిని ఒప్పించాడు..

 

తమ దగ్గర బంధువు వైషాక్ మంచివాడని తనకిచ్చి పెళ్లి చేయమని దగ్గర బంధువు కృతి తండ్రికి వైషాక్ గురించి చెప్పాడు. పైగా వైషాక్ కి కృతి తో మొదటి పెళ్లి. కృతికి ఇది రెండో పెళ్లి. నాకు పెళ్లయి పాప ఉందని తెలిసినా కూడా తనతో ఉంచుకోవడానికి ఇష్టపడ్డాడని తెలిసి కృతి కూడా తనని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది పెళ్లి అయిన తర్వాత రెండు నెలల పాటు ఎంతో ప్రేమగా ఆప్యాయంగా కృతితో ఉన్నాడు వైషాక్. ఆ తర్వాత గర్ల్స్ వెళ్లి వచ్చాడు తన దగ్గర ఉన్న డబ్బులు అన్ని పోవడంతో ఎడ్యుకేషన్ కి సంబంధించి ఓ ఇన్స్టిట్యూట్నెస్ లాంచ్ చేస్తానని కృతి దగ్గర నుంచి నాలుగు లక్షల తీసుకున్నాడు

ఆ తరువాత మన స్టూడెంట్స్ ఫారం వెళ్లడానికి మన సంస్థ బాగుండాలని ఫర్నిచర్ మిగతా అవసరాల కోసం అని మరో ఆరు లక్షలు తీసుకున్నాడు కృతి దగ్గర నుంచి ఎంతో అప్పుడప్పుడు వారిద్దరి మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి ఇది చాలాదన్నట్టు మరో 10 లక్షలు ఇవ్వమని కృతి దగ్గర మొండికేసాడు వైషాక్. తన ఆస్తి కాగితాలు తీసుకొచ్చి ఇస్తే వాటిని తాకట్టు పెట్టుకొని తర్వాత తీర్చి ఇస్తానని చెప్పాడు ఎవరని చెప్పేసింది. దాంతో ఇద్దరికీ గొడవలు జరిగాయి. ఒక వారం రోజులపాటు కృతికి దూరంగా ఉన్నాడు. ఆ తరువాత ఒకరోజు ఇంటికి వచ్చాడు. తన భార్యతో ప్రేమగా ఉన్నాడని అత్తమామలు అనుకున్నారు.

సాయంత్రం నాలుగు గంటలకు బయటకు వచ్చిన కృతి రాత్రి పది అయినా కూడా బయటకు రాలేదు. 10:45 కి కృతి వాళ్ళ అమ్మ తలుపు కొట్టగా కృతి ఆరోగ్యం బాగోలేదని ఆమెను మంచం మీద పడుకోబెట్టి అక్కడ నుంచి మెల్లగా ఎస్కేప్ అయ్యాడు వైషాక్. విషయం అర్థం చేసుకున్న కృతి తండ్రి వైషాక్ ని నిలదీయడానికి కారుకి అడ్డుగా నిలబడ్డాడు. వెంటనే వైషాక్ తప్పించుకొని పారిపోయాడు. కృతిని తన తండ్రి హాస్పిటల్ కి తీసుకువెళ్లాడు. ఆలోపే తను చనిపోయిందని చెబుతారు. వెంటనే వైషాక్ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు కృతి తండ్రి. రెండు రోజుల తర్వాత తను లొంగిపోతాడు. పోలీసులకు ముందుగా అబద్ధాలు చెప్పినా చివరికి వైషాక్ నిజం చెబుతాడు. తన తల్లి రాదని మూడేళ్ల కూతురిలోనే తన కూతుర్ని చూసుకుంటూ బ్రతికేస్తున్నారు ఆ వృద్ధ దంపతులు . ఇలాంటి కష్టం ఏ తల్లిదండ్రులకు ఏ బిడ్డకు రాకూడదు.