Vishal:డూప్ లేకుండా సినిమాలను తెరకెక్కించే హీరో విశాల్ తాజాగా పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు.. ఎటువంటి డూప్ లేకుండా సొంతంగా రిస్కీ షాట్లు చేసే ఈయన ఎన్నోసార్లు గాయాల పాలయ్యారు. అయితే ఇప్పుడు మాత్రం ఎలాంటి గాయాలు లేకుండా చాలా సేఫ్ గా బయటపడినట్లు తెలుస్తోంది.. అసలు విషయంలోకి వెళితే తాజాగా హీరో విశాల్ నటిస్తున్న సినిమా షూటింగ్ చెన్నైలో జరుగుతోంది. దీంట్లో భాగంగా ఒక ఫైట్ సీన్ తీస్తున్నారు.
దీనికోసం ఫైట్ మాస్టర్స్ అంతా రెడీ చేశారు. కానీ ఎక్కడ తేడా వచ్చిందో తెలియదు యాక్షన్ చెప్పాక వాహనం ఒక్కసారిగా ఫైటర్ల పైకి దూసుకొచ్చింది. ఆ టైంలో సీన్లో విశాల్ తో పాటు చాలామంది ఫైటర్స్ ఉన్నారు. హీరో విశాల్ నేలపై మోకాళ్లపై ఉన్నారు.. గోడను వెహికల్ ఢీ కొట్టినప్పుడు బ్లాస్ట్ జరిగింది. తర్వాత వాహనం అక్కడ ఆగిపోవాలి కానీ ఏం జరిగిందో తెలియదు ఆగకుండా ముందుకు దూసుకు వచ్చింది. క్షణాల్లోనే అప్రమత్తమైన అందరూ పక్కకు పరుగులు పెట్టారు .. అయినా కూడా ఒక నలుగురికి గాయాలు కాగా వెంటనే వారిని హాస్పిటల్ కు తరలించారు.
View this post on Instagram