Rakul Preet Singh .. టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన రకుల్ ప్రీతిసింగ్ ఈ మధ్యకాలంలో పెద్దగా ఏ సినిమాల్లో కూడా కనిపించలేదు. కానీ బాలీవుడ్లో అడుగుపెట్టి పలు సినిమాలతో బిజీగా ఉంది. ఇదిలా ఉండగా.. రకుల్ ప్రొడ్యూసర్ జాకీ భగ్నానితో రిలేషన్షిప్ లో ఉన్నట్లుగా తన పుట్టినరోజు సందర్భంగా గత సంవత్సరం ప్రకటించింది. దీంతో వీరిద్దరూ చట్టపట్టాలేసుకొని తిరుగుతూ అప్పుడప్పుడు మీడియాకు కనిపించడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ క్రమంలోనే ప్రియుడితో పెళ్లికి రెడీ అయిందనే విషయాన్ని రకుల్ సోదరుడు అయన్ సోషల్ మీడియాలో తెలియజేయడం జరిగింది.
దీంతో వీరి వివాహం అక్టోబర్, నవంబర్ నెలలో జరుగుతుందని.. గత ఏడాది వార్తలు వినిపించాయి. ఈ విషయంపై రకుల్ మాట్లాడుతూ.. తన గురించి ప్రతివారం ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఈ వార్తలు ప్రకారం నాకు గత ఏడాది నవంబర్ లోనే వివాహం జరిగిపోయిందని.. అసలు నా పెళ్లి ఎలా జరిగిందో మాత్రం ఎవ్వరు చెప్పలేకపోతున్నారు. అంటూ ఘాటుగా స్పందించినట్లు సమాచారం. ప్రస్తుతం నా ధ్యాస అంతా నటన పైనే ఉందంటూ క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇక రకుల్ ప్రీతిసింగ్ భారతీయుడు-2 సినిమాలో నటిస్తున్నది.