Sri Satya : స్టార్ మా లో ప్రసారమవుతున్న బీబీ జోడి కంటేస్టంట్స్ లో మెహబూబ్ శ్రీ సత్య కూడా జోడి గా డాన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే.. వీరిద్దరూ కలిసి చేస్తున్న డాన్స్ తో పాటు పలు ఈవెంట్లలో కూడా హుషారుగా పాల్గొనడం తో.. వీరిద్దరూ లవ్ లో ఉన్నారా అనే టాక్ కూడా జోరుగా ప్రచారం సాగుతోంది.. ఈ లవ్ ఐడియాను అడ్డం పెట్టుకుని వాలెంటెన్స్ డే రోజున మెహబూబ్ ఆడియన్స్ అందర్నీ బకరాలను చేసే పనిలో పడ్డాడు.. శ్రీ సత్య మాత్రం మెహబూబ్ పై ఓ రేంజ్ లో గొడవ పడింది.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది..
మెహబూబ్ శ్రీ సత్య బీబీ జోడీకి అవసరమైన నెక్స్ట్ సాంగ్ ప్రాక్టీస్ లో ఉంటారు. అప్పుడే మెహబూబ్ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని.. ఎలా ప్రపోజ్ చేయాలి అంటూ శ్రీ సత్య దగ్గరకు వెళ్తాడు. నార్మల్ గా ప్రపోజ్ చేయమని శ్రీ సత్య చెబుతుంది. లేట్ చేస్తే మళ్లీ ఆ ఛాన్స్ మిస్ అవుతావేమో చూసుకో అని కూడా సలహా ఇచ్చింది. దాంతో వెంటనే ప్రపోజ్ చేయాలని మెహబూబ్ డిసైడ్ అవుతాడు.. ఒక ఫ్లవర్ బొకే తీసుకుని మోకాళ్ళ మీద కూర్చుని శ్రీ సత్య కి ప్రపోజ్ చేస్తాడు.. ఆ మాట వినగానే శ్రీ సత్య కోపంతో ఊగిపోతుంది..
ఇన్ స్టాగ్రామ్ లో వ్యూస్ వస్తే ఫ్యూచర్ ఉన్నట్టేనా.. ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ లో ఈ విషయం చాలా పెద్ద పెంట అయింది. ఇప్పుడు కూడా పెంట అవుతుంది. అది నా తప్పు కాదు .. నన్ను ఆక్సెప్ట్ చేయమని మెహబూబ్ అడుగుతాడు. లైఫ్ లో కరెక్ట్ పర్సన్స్ ఉండరని శ్రీ సత్య అంటుంది. రేపు నీకు ఇంకొక అమ్మాయి నచ్చదని గ్యారెంటీ ఏంటి మెహబూబ్ ను శ్రీ సత్య ప్రశ్నిస్తుంది.
మెహబూబ్ కొంపతీసి ఇది ఫ్రాంక్ కాదు కదా అని శ్రీ సత్య అనుమానిస్తుంది. సుపోజ్ ఫ్రాంక్ అని చేస్తే నువ్వు నీ మూడ్ మారిపోయి మధ్యలో వెళ్ళిపోతే నేను ఏం చేయాలి.. అని మెహబూబ్ బిస్కెట్ వేస్తాడు. నేను ఫిక్స్ అయిపోయాను. నా లైఫ్ లోకి ఎవరిని రానివ్వకూడదుని.. రాకూడదు అని అనుకున్నాను.. నేనే కాదు ఇంకా ఎవరైనా సరే వచ్చి నీకు ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేయవా అని మెహబూబ్ అనగానే అవును అని శ్రీ సత్య తల ఊపుతుంది. మొత్తానికి ఇది ఫ్రాంక్ అని కంక్లూజ్ చేస్తారు.