Pan India Star : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఉన్నంత బిజీగా ఏ హీరో లేడేమో.. ప్రభాస్ వరుస సినిమా షూటింగ్లలో పాల్గొంటున్నారు. ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలన్నీ కూడా భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాలే.. ప్రాజెక్ట్ కె, సలార్ ప్రాజెక్టులతోపాటు మారుతీతో హర్రర్ బ్యాక్ డ్రాప్ సినిమా చేస్తున్నారు.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది..
ఈ సినిమా షూటింగ్ లో ప్రొఫైల్లో సాగుతోంది. కమర్షియల్ హీరోగా గుర్తింపు ఉన్న ప్రభాస్ హర్రర్ కాన్సెప్ట్ చేయడం.. అది కూడా మారుతీ దర్శకత్వంలో సినిమా చేస్తుండడంతో ప్రభాస్ అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అయితే విమర్శలను పట్టించుకోకుండా ప్రభాస్ ఈ సినిమా షూటింగ్ వేగంగా పూర్తి చేస్తున్నారు. మారుతి కూడా తన రెగ్యులర్ కామెడీ స్టైల్ లో కాకుండా ఈసారి కొంచెం యాక్షన్ టచ్ కూడా ఇవ్వబోతున్నట్లు సమాచారం.
మారుతి సినిమా లిమిటెడ్ బడ్జెట్ లో తెరకెక్కుతుందట.. టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమా 100 కోట్లకు తక్కువేనని టాక్. అంతేకాకుండా ఈ సినిమా కి ప్రభాస్ రెమ్యూనరేషన్ కూడా తీసుకోవడం లేదట . ఈ సినిమా లాభాల్లో మాత్రం వాటా తీసుకుంటున్నట్లు సమాచారం. అవసరమైన సీన్లు, హెవీ గ్రాఫిక్స్ లేకుండా మారుతి ఈ సినిమాను పక్కాగా ప్లాన్ చేస్తున్నారట..
షూటింగ్ కూడా కేవలం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే కంప్లీట్ చేయనున్నారని తెలుస్తోంది. హర్రర్ కామెడీ నేపథ్యంలో రానున్న ఈ సినిమాకు రాజా డీలక్స్ అనే టైటిల్ ను పరిశీలనలో ఉంచారు. రాజా డీలక్స్ అనే థియేటర్ చుట్టూ తిరిగే తాత మనవళ్ళ కథ తో ఈ సినిమా తెరకెక్కనుంది.. ఇప్పటికే రామోజీ ఫిలిం సిటీ లో పాతకాలంనాటి థియేటర్ సెట్ వేసినట్లు.. దానికి తగ్గట్టు షూటింగ్ కూడా జరిగినట్టు సమాచారం. ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా మాళవిక మోహన్, నిధి అగర్వాల్ , ఆశికా రంగనాథన్ నటిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి తమన్ సంగీతం సమకూరుస్తున్నారు.