Tulsi Plant : తులసి మొక్క ప్రాముఖ్యత.. పురాణాలు ఏం చెబుతున్నాయంటే..?

Tulsi Plant : తులసి మొక్కలు ఇంటి ముందర నాటడం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తులు ప్రవేశించలేవు. ఇక తులసి మొక్క నుంచి వచ్చే స్వచ్ఛమైన గాలి కూడా మనకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఇక తులసి మొక్కకు ప్రతి రోజు పూజ చేయడం వల్ల ఆర్థిక సంపద పెరుగుతుంది అని.. లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది అని శాస్త్రం చెబుతోంది. కేవలం తులసి మొక్క ఇంట్లోకి ధనాన్ని ఇవ్వడమే కాదు ఆరోగ్యప్రదాయిని అని కూడా చెబుతారు. అందుకే హిందూ పురాణాల ప్రకారం తులసి మొక్కకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. ఇకపోతే జీవితంలో సుఖసంతోషాలు నెలకొనాలంటే నమ్మకం అనేది చాలా ముఖ్యం. తులసి మొక్క అనేది విష్ణువుకు లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనదని అనే విషయం మన ఆచారాల నుండి వస్తూనే ఉంది. ఇతర దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి సైతం ప్రజలు ఇంట్లో తులసి మొక్కను ను పూజిస్తూ ఉంటారు.

ఇక తులసి ఆకులు లేని విష్ణు పూజ అసంపూర్ణంగా భావిస్తూ ఉంటాము.ఇక హనుమంతుడిని పూజించేటప్పుడు కచ్చితంగా తులసి ఆకులతో పూజించడం జరుగుతూ ఉంటుంది. ఇక అలా తులసి ఆకులతో దండను చేసి తులసి మాలను కూడా ధరిస్తూ ఉంటారు. మన పురాణాల ప్రకారం తులసిని బృందగా పిలుస్తారు. అయితే కాలనేమి అనే ఒక రాక్షసుడికి ఒక అందమైన కూతురు ఉండేది. ఆమె ఒక యువరాణి.. ఆమె మహా విష్ణువు యొక్క భక్తురాలు. ఇక శివుడు యొక్క మూడో కన్ను మంటల నుండి పుట్టిన వాడు జలంధరుడు. ఇక ఈ జలంధరుడు ఆ అందమైన యువరాణి బృందను ప్రేమించి, వివాహం చేసుకుంటాడు.

Importance of Tulsi Plant What do the myths say
Importance of Tulsi Plant What do the myths say

అయితే జలంధరుడు మరణానికి శ్రీ విష్ణు కారణం కావడంతో బృంద విష్ణువును శపిస్తుంది.దీంతో తాను సాలిగ్రామం అంటే శిల రూపంలో జీవిస్తానని విష్ణువు చెప్పాడు. గండకి నది వద్ద సాలిగ్రామ శిల గా విష్ణువు మారిపోతాడు. ఇక బృందా చనిపోయేముందు విష్ణుమూర్తి ఆమెను తులసిగా పిలిచి తనతో పాటు పూజింపబడుతుంది అని ఇక అందరూ తులసిగా ఆరాధిస్తారు అని వరం ఇస్తాడు . అందుకే విష్ణుమూర్తికి తులసి ఆకులు లేకుండా చేసే పూజ ఎప్పటికీ పూర్తవదు. అందుకే హిందూ ఆచారాలలో తులసి కి విడదీయరాని బంధం ఏర్పడింది. అందుకే లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువునకు కలిపి పూజ చేసేటప్పుడు తప్పకుండా తులసి ఆకులను పూజలో సమర్పిస్తారు. తులసిని పూజించడం వల్ల శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవి కరుణ కటాక్షం వారిపై ఉంటుంది.