Zodiac Signs : ఈ రాశుల వారు పగడం ధరిస్తే డబ్బే డబ్బు.. మరి మీరు కూడా ఉన్నారా..?

Zodiac Signs : సాధారణంగా వాస్తు శాస్త్రం ప్రకారం.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని విషయాలు మనం పాటించాల్సి ఉంటుంది. ఇటు సైన్స్ పరంగా అటు సాహిత్యపరంగా రెండు రకాలుగా కూడా మనకు లాభం అనేది చేకూరుతుంది. ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎవరైనా ఒక వ్యక్తి జాతకంలో చెడు స్థితి కనుక ఏర్పడినట్లయితే చెడు ప్రభావాలను ఎదుర్కుంటూ ఉంటే అలాంటి వాళ్లు తప్పకుండా పగడాన్ని ధరించాలి.. ఎరుపు రంగు కలిగిన రాయిని పొదిగిన ఉంగరం ధరించడం వల్ల అదృష్టం మీ ఇంటి తలుపు తడుతుంది. ముఖ్యంగా రాశి ఫలాల తో పాటు చంద్రరాశి అనేది కూడా మరొకటి ఉంటుంది ఇది ఒక్కో రాశి వారికి ఒక్కో రకంగా ఉంటుంది.

అంతేకాదు చంద్రరాశి ఒక వ్యక్తి పుట్టినప్పుడు ఏ స్థానంలో ఉందో అన్నదాన్ని బట్టి కూడా రంగురాళ్లు మారుతూ ఉంటాయి. ఉదాహరణకు చందమామ కుంభ రాశిలో ఉంటే ఆ రోజు భూమిపై పుట్టిన వారు కుంభ రాశి యొక్క మూన్ సైన్ కలిగి ఉంటారు. ఇకపోతే మూన్ సైన్ ఆధారంగా ఏ రాశి వారు ఎలాంటి రంగు రాయి ధరించాలి అనే విషయాలను కూడా జ్యోతిషశాస్త్రంలో చెబుతున్నారు. అంగారక గ్రహం వారు శక్తి , సాహసం, బలానికి ప్రతిరూపం.. వీరు పోలీస్, నాయకత్వం , సైన్యం, రాజకీయాలు, వైద్యం , రియల్ ఎస్టేట్ వంటి మొదలైన రంగాలలో ఉన్న వారికి మంచి ప్రయోజనం లభిస్తుంది. ఆకస్మిక భయం, మానసిక ఒత్తిడిని తగ్గించడానికి పగడం చాలా ఉపయోగపడుతుంది.

If they wear coral in these constellations they will make a lot of money
If they wear coral in these constellations they will make a lot of money

సోమరితనం, మానసిక ఇబ్బందుల నుండి కూడా పగడం బయటపడేస్తుంది. రక్త సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లైతే అలాంటి వారు పగడం ధరించడం వల్ల ఆ సమస్య నుంచి బయట పడతారు. పురుషులు తమ కుడి చేతి ఉంగరం వేలుకి పగడపు ఉంగరాన్ని ధరిస్తే .. స్త్రీలు ఎడమ చేతి యొక్క ఉంగరపు వేలు కి పగడం ఉంగరం ధరించాలి. ముఖ్యంగా మేష రాశి వారు పగడాన్ని ధరించడం వల్ల అంగారకుడి బలం కూడా పెరుగుతుంది. ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని పొందడంతో పాటు అనారోగ్య సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు. వృశ్చిక రాశి వారు , సింహ రాశి వారు కూడా పగడపు ఉంగరం ధరించడం వల్ల లక్ష్మీదేవి తలుపు తడుతుంది.