Acharya: రంగారెడ్డి జిల్లా కోకాపేటలో చిరంజీవి నటించిన ఆచార్య సినిమా సెట్ లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సిగరెట్లు తాగి పడేయడంతో ధర్మస్థలి టెంపుల్ సెట్టులో మంటలు అంటుకున్నాయి. క్షణాల్లోనే చుట్టుపక్కల ప్రాంతాలకు మంటలు వ్యాపించడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పి వేశారు. అయితే ఆచార్య సినిమా సెట్ పాతది కావడంతో ప్రాణాపాయం తప్పింది స్వల్పంగా ఆస్తి నష్టం జరిగింది.
విజువల్ వండర్ లా ఉన్న ఈ సెట్ ను షూటింగ్ తర్వాత తీసేయకుండా అలాగే ఉంచేశారు. ప్రైవేటు ఫామ్ హౌస్ లో ఉన్నది కావడంతో సెట్ అలాగే ఉంది. ఇప్పుడు అక్కడ మంటలు చెలరేగాయి. 20 ఎకరాల విస్తీర్ణంలో అప్పట్లో దీని రెడీ చేయడం హైలైట్ .. గాలిగోపురం మొదలు ప్రతిదీ ప్రత్యేక జాగ్రత్త తీసుకొని దాదాపు రూ.23 కోట్లు ఖర్చు చేసి సెట్ వేశారు. అయితే ఇప్పుడు ఆ సెట్ మొత్తం అగ్నికి ఆహుతి అయింది.