Puja Room : ఇంట్లో సిరి సంపదలు ఉండాలంటే పూజ గదిలో ఇవి ఉండాల్సిందే..!!

Puja Room : ముఖ్యంగా మన భారతదేశంలో ఎక్కువగా వాస్తు దోషాలను మనం నమ్ముతూనే ఉంటాము..వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో పెట్టుకొనే వస్తువులకు.. వాటిని ఇంట్లో ఉంచే దిశలకు కొన్ని ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉండే ప్రతి వస్తువు కూడా ఆ ఇంటి యొక్క మంచి చెడులను సూచించే శక్తి ఉంటుందట. అలాంటి వస్తువుల వల్ల సానుకూలంగా లేదా ప్రతికూలంగా ప్రభావం చూపిస్తుంది. ఇంట్లో వాస్తు దోషాలు ఉండడంవల్ల ఆ ఇంట్లో వ్యక్తి చేసే పనులు విఫలమవుతాయని నమ్ముతూ ఉంటాము.

అందుచేతనే వాస్తు దోషాలను తొలగించుకోవడానికి కొన్ని విషయాలనూ వాస్తు నిపుణులను తెలియజేస్తున్నారు . ఇక ఎవరైనా ఇంట్లో ఎంత డబ్బు పెట్టినప్పటికీ కూడా ఆ డబ్బు నిలవకుండా ఉంటే దీనికి కారణం వాస్తే కావచ్చు అని తెలియజేస్తున్నారు. అలాంటి సమయంలో పూజ గదిలో ఎటువంటి వస్తువులను ఉంచడం వల్ల సుఖ సంపదలు కలుగుతాయి అనే విషయం తెలియజేయడం జరిగింది.

Puja Room if you want to have Siri treasures in the house
Puja Room if you want to have Siri treasures in the house

1). ముందుగా వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో పూజ గది నిర్మాణానికి సరైన దిక్కుని ఎంచుకోవాలి. పూజ గదికి ఈశాన్య దిక్కు ఉత్తమమైనదిగా పండితులు పరిగణించడం జరుగుతోంది. ఈ దిశలో దేవుడి గదిని నిర్మిస్తే ఇంట్లో చాలా సుఖసంతోషాలు కలుగుతాయని నమ్మకం. ఏ ఇంట్లో అయినా దక్షిణ దిశలో మాత్రం పూజగదిని నిర్మించకూడదు.

2). గంగా జలం : మన హిందూ సాంప్రదాయం లో గంగా నది నీటి యొక్క ప్రత్యేకమైన స్థానం ఉన్నది.. ఈ నీటిని మనం చాలా పవిత్ర జలంగా భావిస్తూ ఉంటాము. ఒకవేళ ఆ నీరు చెడిపోతే ఆ నీటి స్థానంలో మరొక పవిత్రమైన జలాన్ని ఉంచడం వల్ల లక్ష్మీదేవి ఆనందిస్తుందట.

3). శంఖం : ఇంట్లో దేవుని మూల శంఖం ఉన్నట్లు అయితే ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీ ఆ ఇంటి చుట్టూ ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈ శంఖం ఉన్నట్లు అయితే శుభప్రదమని నమ్మకమట. ఇక వీటితో పాటే నెమలీకలు ఉంచడంవల్ల ఆ ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని నమ్మకం.

కేవలం ఇలాంటివి అన్ని నమ్మకం పైన ఆధారపడి ఉంటాయి.