Health Benefits : బంగారం లాంటి ఈ ఆకులను అస్సలు పారేయకండి..! ఎన్ని ప్రయోజనాలో చూడండి..!

Health Benefits : ముల్లంగి తినటానికి చాలా మంది ఆసక్తి చూపరు.. దీనిని కూర, పచ్చడి, చారులో ఎక్కువగా వాడతారు.. ముల్లంగి లో పోషకాలతో పాటు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.. ఇది జీర్ణ సంబంధిత సమస్యలు రాకుండా చేస్తుంది.. ముల్లంగి కంటే కూడా ముల్లంగి ఆకుల లోనే ఎక్కువ పోషక విలువలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..! ముల్లంగి తో పోలిస్తే ముల్లంగి ఆకుల లోనే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.. ఈ ఆకుల వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..!

ముల్లంగి ఆకులలో విటమిన్ సి లభిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఇంకా ఐరన్, కాల్షియం , ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటాయి. ఈ ఆకులను ఉడికించి ఆ నీటిని క్యాన్సర్ తో బాధపడే వారు తాగితే అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. క్యాన్సర్ కణాలకు అడ్డుకట్ట వేయడంలో ఈ ఆకుల నీళ్లు సహాయపడతాయి. క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా ఇవి దాడి చేస్తాయి.

health benefits of Radish Leaves
health benefits of Radish Leaves

క్యాన్సర్ రాకుండా చేస్తుంది. ముల్లంగి ఆకులలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది డైజేషన్ ప్రక్రియను సాఫీగా సాగేలా చేస్తుంది. గ్యాస్, అసిడిటీ, అజీర్తి వంటి సమస్యలను తగ్గిస్తుంది. మలబద్ధకం ను నివారిస్తుంది.ఫైల్స్ సమస్యతో బాధపడే వారికి ముల్లంగి ఆకులు వరం. ఈ ఆకులను ఎండబెట్టి దంచి పొడి చేసుకోవాలి. ఈ ఆకుల పొడి కి సమాన మోతాదులో పంచదార కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పొడిని ఒక సీసాలో నిల్వ చేసుకోవాలి. ప్రతిరోజు ఈ పొడిని ఒక చెంచా తీసుకుని ఒక గ్లాస్ నీటిలో కలుపుకుని తాగితే ఫైల్స్ సమస్య త్వరగా తగ్గిపోతుంది.