Health Benefits : నానబెట్టిన వేరుశనగ తో ఎన్ని లాభాలో తెలుసా..?

Health Benefits : సాధారణంగా వేరుశెనగలు వేయించి తిన్నా లేదా పచ్చిగా తిన్నా సరే దీని లాభాలు మాత్రం మనకు పుష్కలంగా లభిస్తాయి. అయితే ఇప్పుడు వేరుశెనగలు ఉడికించి లేదా నీటిలో నానబెట్టి తింటే మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా నానబెట్టిన వేరుశనగ ను తీసుకోవడం వల్ల మంచి ఆరోగ్య ప్రయోజనాలు అయితే పుష్కలంగా లభిస్తాయి అని తెలియజేయడం గమనార్హం. ఎండాకాలంలో నానబెట్టిన వేరుశనగ విత్తనాలను తిన్నట్లయితే అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.

ఇకపోతే కాల్చిన వేరుశెనగ లను వేసవి కాలంలో ఎక్కువగా తింటే గ్యాస్ , అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వేరుశనగలను ఉడికించి లేదా నీటిలో నానబెట్టి తింటే చాలా సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు. నానబెట్టిన వేరుశనగలు తినడం వల్ల బలహీనత, స్థూలకాయం వంటి సమస్యలు కూడా దూరమవుతాయి. అంతేకాదు గుండె పోటు కూడా తగ్గుతుంది. ఇకపోతే పచ్చి వేరుశనగలని రాత్రంతా నానబెట్టి వాటిని ఆహారంలో ఒక భాగంగా చేర్చుకుంటే రక్తప్రసరణ మెరుగు పరిచి.. గుండె పనితీరు మెరుగుపడుతుంది. ఆరోగ్యంగా ఉండాలంటే నీటిలో నానబెట్టిన వేరుశనగలు తీసుకోవాల్సిందే.నానబెట్టిన వేరుశనగలు తినడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ఇందులో ఉండే ప్రోటీన్, కాల్షియం వల్ల వెన్నునొప్పి , కీళ్ల నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.

Health Benefits of soaked peanuts
Health Benefits of soaked peanuts

అంతేకాదు వేరుశెనగలు నానబెట్టి తినడం వల్ల క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల నుంచి కూడా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. ఇందులో పుష్కలంగా లభించే యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా క్యాన్సర్ ను నివారించవచ్చు. అంతేకాదు కండరాలు మెరుగైన రీతిలో అభివృద్ధి చెందుతాయి. చర్మం యొక్క రంగు కూడా మెరుగుపడుతుంది. వేయించిన వేరుశనగలు కంటే నీటిలో నానబెట్టిన వేరుశనగలు తినడం వల్ల ఎసిడిటీ సమస్య దూరమవుతుంది. పొటాషియం, క్యాల్షియం, మాంగనీస్ , కాపర్, ఐరన్ వంటి మొదలైన పోషకాలు లభించడం వల్ల సమస్యలు కూడా దూరమవుతాయి. ఇక అంతే కాదు మధుమేహం కూడా దూరం అవుతుంది.