Women Bangles : వివాహిత స్త్రీలు గాజులు ధరించడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి..?

Women Bangles : సుమంగళికి పసుపు , కుంకుమ ఎంత ప్రాధాన్యత ఉంటుందో.. మట్టిగాజులు కూడా అంతే ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. ఈ కాలంలో చాలామంది వివాహిత స్త్రీలు కూడా మారుతున్న ట్రెండ్ కి తగ్గట్టుగా మట్టి గాజులు వేసుకోవడం మానేశారు. ప్రస్తుతం రకరకాల లోహాలతో తయారు చేసిన గాజులు కూడా అందుబాటులో ఉండడం వల్ల మట్టి గాజులు వేసుకునే ఆడవారే కరువయ్యారు అని చెప్పవచ్చు. మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే కాలం మారుతున్న కొద్ది గాజులు వేసుకునే మహిళల సంఖ్య కూడా తగ్గుతోంది. కానీ పండుగలు ఏదైనా శుభకార్యాల సమయంలో మాత్రం గాజులు వేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

ఇకపోతే లక్ష్మీ స్వరూపంగా భావించే ఆడపిల్లలు చేతినిండా గాజులు వేసుకుని ఇంట్లో తిరగడం వల్ల ఆ గాజుల శబ్దానికి ఇంట్లో ప్రతిధ్వనించే శబ్ధం కారణంగా ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ బయటికి పోతుంది . అంతేకాదు లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించడం తో పాటు ఆర్థిక సంపద పెరుగుతుంది. అలాగే పాజిటివ్ వైబ్రేషన్స్ ఇంటి చుట్టూ ఆవహిస్తాయి. ముఖ్యంగా వేసుకున్న గాజులు పగిలిపోకుండా జాగ్రత్తగా చూసుకునే అమ్మాయిలు ఇంటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు అని ఇంటి యొక్క భవిష్యత్తు కోసం ఆరాట పడతారు అని పండితులు చెబుతున్నారు. ఆడవారు గాజులు వేసుకోవడం వెనుక కేవలం అందం మాత్రమే కాదు సైన్స్ కూడా ఏమి చెబుతోంది అనే విషయాలను మనం తెలుసుకుందాం.

What is the motive behind married women wearing Bangles
What is the motive behind married women wearing Bangles

గాజులు వేసుకోవడం వల్ల మహిళలు అలసటకు గురి కారు .. ఎందుకంటే గాజులు ధరించినపుడు వారిలో ఒత్తిడి నీ భరించే శక్తి కూడా లభిస్తుంది. గాజులు వేసుకున్న వారి మణికట్టు ప్రదేశంలో ఉన్న గాజులు పైకి కిందకి కదలడం వల్ల నరాలు ఉత్తేజితమవుతాయి. రక్తప్రసరణ వేగం పెరుగుతుంది. గాజులు వేసుకోవడం వల్ల శరీరంలో వేడి కూడా తగ్గుతుంది. ఇక అంతే కాదు బంగారు గాజులు వేసుకున్న సరే తప్పకుండా రెండు మట్టి గాజులను వేసుకోవాలి. హార్మోన్ల స్థాయిని పెంచడానికి కూడా గాజులు బాగా పనిచేస్తాయి . శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి పూజలో కూడా గాజులను తప్పకుండా ఉపయోగిస్తారు. వివాహిత స్త్రీలు మాత్రమే కాదు ప్రతి ఒక్క ఆడవారు కూడా కనీసం రెండు మట్టిగాజుల నైనా వేసుకోవాలి అని శాస్త్రం తో పాటు సైన్స్ కూడా చెబుతోంది.