Sunday, May 22, 2022

Pasupu Kumkuma : పసుపు – కుంకుమ నేల జారితే అరిష్టమా..?

Pasupu Kumkuma : హిందూ సాంప్రదాయం ప్రకారం పసుపు, కుంకుమ కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అంతే కాదు దేవలోకంలో కూడా పసుపు , కుంకుమ లకు ప్రత్యేకమైన స్థానం లభించడం గమనార్హం. వివాహిత స్త్రీకి సుమంగళి గా ఉండడానికి ప్రతీకలుగా పసుపు,కుంకుమ సూచిస్తారు. పసుపు , కుంకుమ .. మనం ఏ పూజా, కార్యక్రమం చేపట్టిన సరే తప్పకుండా హిందువులు ఈ రెండు లేనిదే పూజలు మొదలుపెట్టారు. ఇంటికి వచ్చిన అతిథులను సాగనంపే టప్పుడు కూడా పసుపు, కుంకుమ , పువ్వులు ఇవ్వడం ఆనవాయితీ. ఆడవారు తమ సౌభాగ్యానికి చిహ్నంగా భర్త ఆయుష్షు కోసం వివాహిత స్త్రీలు తమ నుదుట కుంకుమ ధరిస్తారు.

ఏదైనా శుభకార్యాలకు , వ్రతాలు, నోములు నోచే టప్పుడు కూడా పక్కింటి వారిని బొట్టు పెట్టి మరి పిలుస్తూ ఉంటారు. పుట్టింటికి వెళ్ళిన ఆడపిల్లలను మెట్టినింటికి పంపించేటప్పుడు పసుపు కుంకుమ ఇచ్చి సాగనంపుతారు. ఎందుకంటే ఆ అమ్మాయి తన భర్తతో జీవితాంతం సంతోషంగా సుఖంగా సుమంగళిగా జీవించాలని పెద్దలు దీవించి ఇవ్వడం గమనార్హం. ఇంతటి గొప్ప స్థానం కలిగిన పసుపు , కుంకుమ ఉన్నట్టుండి నేల జారితే కొంతమంది లో భయం మొదలవుతుంది. అంతే కాదు ఏదో ఒక కీడు అని , చెడు జరగబోతోందని కూడా భావిస్తారు. అయితే ఇదంతా కేవలం అపోహ మాత్రమే అని పండితులు చెబుతున్నారు.

Is it bad if Pasupu Kumkuma soil slips
Is it bad if Pasupu Kumkuma soil slips

పసుపు , కుంకుమ ఏదైనా కార్యాలు చేసేటప్పుడు కింద పడితే మీరు భూమాతను మరిచిపోయారు అని ఇక అదే సమయంలోనే భూమాతకు బొట్టు పెట్టి.. మిగతా కుంకుమను చెట్లల్లో వేస్తే సరిపోతుంది. మరిముఖ్యంగా మంగళ , శుక్రవారాల్లో కుంకుమ నేల జారితే చాలామంది భయంతో వణికి పోతూ ఉంటారు. పండితులు ఏం చెబుతున్నారు అంటే ఆ రోజు మీ ఇంటికి వచ్చిన ముత్తైదువకు బొట్టు పెట్టి పంపిస్తే దోషం పోతుందట. ఇక వాస్తవానికి కుంకుమ కింద పడడం అంటే భూదేవికి బొట్టు పెట్టమని సంకేతం కాబట్టి మీరు ఎటువంటి అపోహలు లేకుండా నిస్సంకోచంగా భూమాతకు బొట్టు పెట్టి ఆ కుంకుమ తీసుకోవచ్చు.

Related Articles

- Advertisement -

తాజా వార్తలు