Vastu Shastra : ప్రతి ఒక్కరు తమ ఇంటిని ఎన్నోకలలతో కట్టుకుంటూ ఉంటారు. అయితే అలాంటి ఇంటిని ప్రతిరోజు శుభ్రతగా మార్చడం లో ఎక్కువగా పెద్ద పీట వేస్తూ ఉంటారు. ఇక వాస్తుశాస్త్రంలో కూడా అనేక విషయాలు శుభ్రత గురించి తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఇల్లు శుభ్రంగా లేకుంటే దరిద్ర లక్ష్మి తాండవమాడుతుందని వాస్తుశాస్త్రం పేర్కొంటోంది. ఇంటిని శుభ్రంగా ఉంచడం కోసం వాస్తు శాస్త్రంలో కొన్ని సూచనలు కూడ పొందుపరచడం జరిగిందట. మన జీవితంలోని అన్ని సమస్యలను పరిష్కరించుకోవడానికి వాస్తుశాస్త్ర నిపుణులు కొన్ని సూచనలు తెలియజేస్తున్నారు వాటి గురించి చూద్దాం.
హిందూ ధర్మం ప్రకారం పరిశుభ్రత ఉన్న ఇంట్లో ఎక్కువగా లక్ష్మీదేవి ఉంటుందని పూర్వ కాలం నుంచి వస్తున్న మాటలు ఇవి. శుభ్రంగా ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం నిలిచి ఉంటుంది అని పెద్దలు కూడా చెబుతూ ఉంటారు. ఇక ఉదయం లేవగానే తమ ఇంటిని శుభ్రం చేసుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన వాస్తు చిట్కాలను పాటించండి అంటూ వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు. ఇలాంటివి పాటించడం వల్ల ప్రతి ఒక్కరి ఇంట్లో లక్ష్మి దేవి తాండవం ఆడుతుందట.
1). మహిళలు సూర్యోదయం, సూర్యాస్తమయం తరువాత చీపుర్లతో ఎవరు ఉడ్చకూడదని వాస్తు శాస్త్రం తెలుపుతోంది. ఇలా ఎప్పుడు పడితే అప్పుడు ఊడ్చడం వల్ల ఆ ఇంట దరిద్ర దేవత చుట్టుముడుతుందట.
2). ముఖ్యంగా రాత్రి సమయాలలో చీపురుతో అస్సలు ఉడ్చకూడదు.. ఇలా చేస్తే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది.
3). మన ఇంట్లో టాయిలెట్లను కూడా శుభ్రం చేస్తూ ఉండాలి.. బాత్ రూమ్ లను అశుభ్రంగా ఉంచడం వల్ల అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. బాత్రూం లో ఎక్కువగా బూజు వంటివి పట్టకుండా చూసుకోవాలి.
4). బాత్రూమ్ నిర్మించేటప్పుడు వాస్తును కచ్చితంగా పాటించి తీరాలి. ఒకవేళ అలా ఎవరికైనా వాస్తు దోషం ఉంటే ఒక చిన్న గిన్నెలో ఉప్పు నింపి ఆ గిన్నెను ఒక మూలన ఉంచితే ఆ దోషాలు తొలగిపోతాయని వాస్తు నిపుణులు తెలియజేయడం జరుగుతోంది.
5). ఇంటి నాలుగు మూలలా ఎప్పుడూ శుభ్రంగా ఉండే విధంగా చూసుకోవాలి.. సాయంత్రం వేళ చెత్తను బయట పడేయకూడదని నిపుణులు తెలుపుతున్నారు.