Shivalinga : ఎట్టి పరిస్థితిలో కూడా శివలింగానికి ఈ వస్తువులను అర్పించకూడదు..!!

Shivalinga : మిగతా దేవుళ్ళతో పోలిస్తే శివలింగానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు కూడా ఉంది. అన్ని దేవతలను విగ్రహ రూపంలో దర్శించుకుంటే శివుడిని మాత్రం లింగం రూపంలో దర్శించుకుంటాము. అయితే మహా పవిత్రమైన ఈ శివలింగానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా కొన్ని వస్తువులను సమర్పించకూడదు. ఇక మిగిలిన దేవతలకు, శివుడికి కూడా కొన్ని విషయాలలో చాలా తారతమ్యాలు ఉన్నాయి. వీటి గురించి ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.. కోరిన కోరికలు తీర్చే భోళా శంకరుడి గా శివుడిని పూజిస్తారు. భక్తిశ్రద్ధలతో పూజిస్తే మాత్రం ఎలాంటి వారినైనా అనుగ్రహిస్తాడని మహేశ్వరుడిని పూజించడం జరుగుతుంది.ఇక మిగతా దేవుళ్లకు సమర్పించినట్లు మహేశ్వరుడికి తిలకం దిద్దరు. శివుడిని ఆరాధించేటప్పుడు ఎప్పటికీ కూడా సింధూరం ఇవ్వకూడదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

ముఖ్యంగా మహిళలు తమ భర్త ఆయుష్యు తో సింధూరాన్ని పోలుస్తారు. ఆధ్యాత్మిక ధార్మిక విశ్వాసాలు ప్రకారం శివుడికి సింధూరం సమర్పించడం అశుభంగా పరిగణిస్తారు. కాబట్టి పరమేశ్వరుడికి సింధూరం అర్పించండి. సనాతన ధర్మం ప్రకారం పసుపును కూడా చాలా స్వచ్ఛమైన పవిత్రమైనదిగా పరిగణిస్తారు. కానీ శివుడికి మాత్రం పసుపును వినియోగించరు. శాస్త్రం ప్రకారం శివలింగం పురుష తత్వానికి చిహ్నం. పసుపు అనేది కేవలం మహిళలకు సంబంధించినది మాత్రమే కాబట్టి లింగానికి పసుపుని సమర్పించరు.ముఖ్యంగా శివారాధనలో మీరు పసుపు ఉపయోగిస్తే.. అది నిరుపయోగంగా మారుతుంది. ఇక పూజ ఫలాలను పొందలేరు. శివలింగం పై తెలిసినా కూడా ఎప్పుడు పసుపు వెయ్యకూడదు. పురాణాల ప్రకారం జలంధరుడు అనే రాక్షసుడికి అతని భార్య పవిత్రత కారణంగా అమరుడై ఉండే వరాన్ని విష్ణువు ఇస్తాడు.

Under no circumstances should these objects be offered to the Shivalinga
Under no circumstances should these objects be offered to the Shivalinga

అమరుడు కావడంతో అతడు ప్రపంచాన్ని అల్లకల్లోలం సృష్టిస్తాడు. ఇలాంటి పరిస్థితిలో విష్ణువు , శివుడు అతడిని చంపడానికి ప్రణాళిక వేస్తారు.. ఇక బృందా తన భర్త జలంధరుడి మరణం గురించి తెలుసుకొని కోపోద్రిక్తురాలుగా మారుతుంది. ఆ కోపంలో తులసి ఆకులను శివారాధన లో ఉపయోగించకూడదని చూపిస్తుంది.శివుడికి కి కొబ్బరి నీళ్ళతో అభిషేకం అసలు చేయకూడదు . అలాగే ఎరుపు రంగు పుష్పాలను కూడా స్వామివారి పూజలో ఉపయోగించకూడదు. శంఖంతో నీటిని కూడా శివలింగంపై పోయకూడదు. కొన్ని కొన్ని నియమ నిబంధనలు పాటిస్తూ శివుడి ఆరాధన చేసినట్లయితే త్వరగా సత్ఫలితాలు పొందవచ్చు. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు కూడా శివ ఆరాధన ఎక్కువగా చేస్తున్నారు కాబట్టి శివ భక్తులకు ఈ ఆర్టికల్ లో వాట్సాప్ లేదా ఫేస్ బుక్ ద్వారా షేర్ చేయండి.