Akshaya Tritiya : అక్షయ తృతీయ నాడు ఈ రాశుల వారికి కుబేర యోగం.. మీ రాశి కూడా ఉందా..?

Akshaya Tritiya : హిందువులు అత్యంత పవిత్రమైన పండుగగా చేసుకునే పండుగలలో అక్షయ తృతీయ కూడా ఒకటి. ప్రతి సంవత్సరం వైశాఖ శుక్ల పక్షం తదియ తిథినాడు అక్షయ తృతీయ ను జరుపుకుంటారు. ఇక ఈ సంవత్సరం 2022 మే 3వ తేదీన అక్షయతృతీయ జరుపుకోబోతున్నాం. కాల ప్రకారం అక్షయ తృతీయ రోజున దానాలు, స్నానాలు, యజ్ఞాలు లాంటివి చేస్తే చాలా ఫలప్రదమట. అంతేకాదు తీర్థయాత్రలు, పుణ్యం కూడా లభిస్తుంది అని శాస్త్రం చెబుతోంది.

హిందువులు పవిత్రమైనదిగా భావించే అక్షయ తృతీయ రోజున ప్రత్యేకంగా ఈ రాశుల వారికి లక్ష్మీ కుబేరయోగం పట్టబోతోంది. అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం సంప్రదాయం కూడా ఉంది. కాబట్టి ఈ రోజున బంగారం కొనుగోలు చేసినట్లయితే లక్ష్మీదేవి కృప ఎల్లప్పుడూ ఉంటుంది అని చెబుతున్నారు. ముఖ్యంగా లక్ష్మీ కుబేర యోగం ఏ రాశుల పై ఉండబోతోంది అనే విషయం తెలుసుకునే ముందు ప్రతి ఒక్కరికి ఈ ఆర్టికల్ ను వాట్సాప్ లేదా ఫేస్ బుక్ ద్వారా షేర్ చేయండి.

Kubera Yoga for those of these constellations on the third day of Akshaya Tritiya
Kubera Yoga for those of these constellations on the third day of Akshaya Tritiya

కర్కాటక రాశి : ఈ రాశివారు ఏ పని చేపట్టినా విజయం సాధిస్తారు. ఎల్లప్పుడూ అదృష్టంతో మీరు ముందుకు వెళ్తారు. ఉద్యోగంలో జీతం పెరిగే అవకాశం తో పాటు ప్రయాణాల ద్వారా కూడా డబ్బు సంపాదించి.. మంచి విజయం పొందుతారు. ముఖ్యంగా ఆర్థిక సంక్షోభం నుండి ఉపశమనం కలుగుతుంది.

సింహరాశి : డబ్బుకు సంబంధించిన ఏ పని అయినా సరే త్వరగా వీరు విజయం పొందుతారు. అంతేకాదు వాణిజ్యం, ఉద్యోగాలలో కూడా అభివృద్ధికి మార్గం తెరుచుకుంటుంది. సింహ రాశి వారు అక్షయ తృతీయ రోజున పెసరపప్పు దానం చేయడం వల్ల ప్రత్యేకమైన ఆనందం , శ్రేయస్సు కూడా పొందుతారు.

ధనస్సు రాశి : వీరి అదృష్టం బంగారంలో మెరిసిపోతుంది. ప్రతి విషయంలో కూడా ఇది వీరికి మద్దతుగా పలుకుతుంది. గృహాలు లేదా వాహన లాభం పొందవచ్చు. అంతే కాదు లక్ష్మీ దేవి వీరిపై ప్రత్యేకమైన అనుగ్రహం కలిగి ఉంటుందట.

ఇక వీరితో పాటు మకర రాశి , వృషభ రాశి వారికి కూడా అక్షయ తృతీయ తర్వాత ఏ పని చేపట్టినా.. అందులో శుభం కలుగుతుందని శాస్త్రం చెబుతోంది.