Vinayaka : పొరపాటున కూడా వినాయక విగ్రహాన్ని అక్కడ పెట్టకండి..!!

Vinayaka : ఆది దేవుడిగా వినాయకుడు పూజలందుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే . వినాయకుడి పూజలు చేసేటప్పుడు అలాగే విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్టించే టప్పుడు కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలి. శాస్త్రం ప్రకారం విగ్నేశ్వరుని విగ్రహం ఎక్కడ పడితే అక్కడ పెట్టడం కుదరదు. ప్రతి ఒక్కరు కూడా విఘ్నాలను తొలగించే వినాయకుని విగ్రహాన్ని తప్పకుండా పెట్టుకోవాలి . ఇలా విగ్రహం పెట్టుకోవడం వల్ల ఆనందం, శ్రేయస్సు అభివృద్ధి పెంపొందుతాయి. వినాయక విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోవడం లేదా ఇతరులకు బహుమతిగా ఇవ్వడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ముఖ్యంగా వినాయక విగ్రహం ఉంటే జీవితంలో వచ్చే ఎన్నో అడ్డంకులను తొలగించుకోవాలి.

ఇంటి ప్రధాన గుమ్మం పై ఇంట్లోకి ప్రవేశించే సింహ ద్వారం పైన వినాయకుడి విగ్రహం ఉండకూడదు. వినాయక విగ్రహాన్ని లేదా ఫోటోలు బాత్ రూమ్ లో కూడా అస్సలు ఉంచకూడదు. పడకగదిలో కూడా గణేష్ విగ్రహాన్ని పెట్టకూడదు. పడకగదిలో గణేష్ విగ్రహాన్ని పెట్టినట్లయితే వైవాహిక జీవితంలో ఇబ్బందులు తలెత్తుతాయి భార్యాభర్తల మధ్య ఒత్తిళ్ళు ఆందోళనలు కూడా తలెత్తుతాయి. నృత్యం చేస్తున్నట్లు ఉండే వినాయకుడి విగ్రహాన్ని మర్చిపోయి కూడా ఇంట్లో పెట్టుకోవద్దు. అలాగే ఇలాంటి విగ్రహాన్ని ఎవరికీ కూడా బహుమతిగా ఇవ్వకూడదు.నృత్యం చేస్తున్నట్లుండే వినాయక విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకున్నట్లయితే ఇంట్లో కలహాలు గొడవలు చోటుచేసుకుంటాయని పెద్దలు విశ్వసిస్తారు.

Do not place the idol of Vinayaka there even by mistake
Do not place the idol of Vinayaka there even by mistake

అంతేకాదు ఎవరికైనా బహుమతిగా ఇచ్చినా సరే వారి జీవితంలో కూడా ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి. కూతురు లేదా ఎవరైనా అమ్మాయి వివాహంలో గణపతి విగ్రహాన్ని ఇవ్వకూడదు. లక్ష్మీ వినాయకుడు ఎప్పుడూ కలిసే ఉంటారు కాబట్టి లక్ష్మీ తో పాటు వినాయకుడు కూడా వుండే విగ్రహాన్ని లేదా ఫోటోను ఇచ్చినట్లయితే శ్రేయస్సు, సంపద కూడా పెరుగుతుందని సమాచారం. విగ్రహానికి ఎడమవైపు పూజించాలి .. కుడివైపు పూజించడం లో కూడా ప్రత్యేక నియమాలను పాటించాలి.సంతాన ప్రాప్తి కావాలని కోరుకునేవారు వినాయక విగ్రహానికి తొండం కుడి వైపు తిరిగి ఉన్న విగ్రహాన్ని ఇంటికి తీసుకు రావాలి. ఇలా చేయడం వల్ల తల్లిదండ్రుల గౌరవించే బిడ్డకు జన్మనిస్తుంది అని నమ్ముతారు. కొబ్బరి నూనెతో దీపం పెట్టడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.