Daily Astrology : నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త వహించాల్సిందే..!

Daily Astrology :  మేషం:
ధన సంబంధ విషయాలలో జాగ్రత్త తప్పనిసరి.. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ఆరోగ్య సమస్యలు కొంత భాదిస్తాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభించేటప్పుడు అవరోధాలు ఏర్పడతాయి. ఇంటా బయట సమస్యలు అధికమవుతాయి. వ్యాపారంలో జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం వల్ల లాభాలు పొందుతారు.

Today horoscope.. beware of driving in these zoadic signs of people's..!
Today horoscope.. beware of driving in these zoadic signs of people’s..!

వృషభం:
వాహనం నడిపే సమయంలో శ్రద్ధ వహించండి. ప్రయాణాలలో నూతన పరిచయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. దీర్ఘకాలిక రుణాలు తీర్చి ఊరట చెందుతారు. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.

మిధునం:
మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా మంచిది. బంధుమిత్రులతో చర్చలు అనుకూల ఫలితాన్ని ఇస్తాయి. క్రయవిక్రయాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి.

కర్కాటకం:
సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుతుంది. వ్యాపార పరంగా నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సంతానానికి నూతన విద్యా విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం ఉన్నప్పటికీ సకాలంలో పూర్తి చేస్తారు.

సింహం:
కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాలలో శుభవార్తలు అందుతాయి.స్నేహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది . ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు ఉన్నత పదవులు లభిస్తాయి.

కన్య:
నూతన వ్యాపార ప్రారంభానికి శ్రీకారం చుడతారు. ఉద్యోగాలలో స్వల్ప మార్పులు ఉంటాయి.సామాజిక సేవ కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. దీర్ఘకాలిక రుణాలు తీర్చి మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

తుల:
నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వృత్తి వ్యాపార వ్యవహారాలలో ఆకస్మిక నిర్ణయాలు తీసుకుంటారు. సన్నిహితులతో చాలాకాలంగా ఉన్న వివాదాలు కూడా పరిష్కారం అవుతాయి. ఆరోగ్య విషయంలో చిన్నపాటి ఇబ్బందులు కలుగుతాయి.

వృశ్చికం:
వృత్తి ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం వల్ల ఉన్నత పదవులు లభిస్తాయి. ధన సంబంధ వ్యవహారాలలో అనుకూలత కలుగుతుంది. సమాజంలో ప్రముఖుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. ప్రయాణాలలో వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్త వహించండి.

ధనస్సు:
వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. గృహమున విందు వినోదాధి కార్యక్రమాలు నిర్వహిస్తారు. సంతానం విద్యా విషయాలు సంతృప్తినిస్తాయి. దూరప్రాంత బంధుమిత్రుల ఆగమనం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది.. ఉద్యోగాలలో జీతభత్యాల విషయంలో శుభవార్తలు వింటారు.

మకరం:
వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు లాభిస్తాయి. సంతాన విద్య ఉద్యోగ విషయంలో శుభవార్తలు వింటారు. ధనపరంగా ఇబ్బందులు ఎదురైనా కూడా అధిగమిస్తారు. దూరప్రాంత బంధుమిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. దీర్ఘకాలిక రుణాలను కొంతవరకు తీర్చి ఊరట పొందుతారు.

కుంభం:
ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వివాహాది శుభకార్య ప్రస్తావన వస్తుంది. దైవచింతన పెరుగుతుంది. చేపట్టిన పనులలో జాప్యం కలిగినా సకాలంలో పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో కొన్ని విషయాలలో విభేదాలు ఉంటాయి.

మీనం:
చిన్న తరహా పరిశ్రమలకు నూతన అవకాశాలు లభిస్తాయి . ఇంటా బయట కొన్ని సంఘటనలు మీకు ఆశ్చర్యం కలిగిస్తాయి. శుభకార్యాలకు ధన వ్యయం చేస్తారు. పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది.