Rashmika Mandanna : ఇక ఆగేదే లేదు.. మితిమీరి ప్రవర్తిస్తే అస్సలు స‌హించ‌నంటున్న ర‌ష్మిక‌

Rashmika Mandanna : క‌న్న‌డ ముద్దుగుమ్మ ర‌ష్మిక ఇప్ప‌డు నేష‌న‌ల్ క్ర‌ష్‌గా మారిన విష‌యం తెలిసిందే. తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల‌లో వ‌రుస సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం పంచుతుంది.స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రంలో ఆడిపాడిన ర‌ష్మిక ఆ త‌ర్వాత పాన్ ఇండియా మూవీ పుష్ప ది రైజ్ చిత్రంలో శ్రీవ‌ల్లిగా పుష్ప‌రాజ్‌తో జ‌త క‌ట్టి తెగ సంద‌డి చేసింది. ఈ రెండు సినిమాల‌తో ర‌ష్మిక రేంజ్ మ‌రింత‌గా పెరిగింది. అయితే ఇటీవ‌ల ర‌ష్మిక‌పై విమ‌ర్శ‌లు ఎక్కువ అవుతున్నాయి. ట్రోలర్స్ కొంద‌రు ర‌ష్మిక‌ని టార్గెట్ చేస్తూ ఆమెపై విమ‌ర్శ‌లు కురిపిస్తున్నారు. ఈ క్ర‌మంలో ర‌ష్మిక ఫైర్ అయింది.

rashmika-fire-on-trollers
rashmika-fire-on-trollers

Rashmika Mandanna :  ర‌ష్మిక ఫైర్..

ర‌ష్మిక క్రేజ్ ఇప్పుడు భారీగా పెర‌గ‌డంతో ఆమెని ప్రోఫెష‌న‌ల్‌గాను, వ్య‌క్తిగ‌త జీవితంలోనూ విమ‌ర్శ‌లు చేస్తున్నారు.. ర‌క్షిత్ శెట్టితో నిశ్చితార్థం క్యాన్సిల్ అయిన‌ప్పుడు స‌ద‌రు హీరో ఫ్యాన్స్ ర‌ష్మిక‌ను తెగ ట్రోల్ చేసిన విష‌యం తెలిసిందే. ఇక విజ‌య్ దేవ‌ర‌కొండ తో డేటింగ్ చేస్తుందంటూ పుకార్లు పుట్టించారు. ఈ నేప‌థ్యంలో ర‌ష్మిక త‌న సోష‌ల్ మీడియా ద్వారా స్పందించింది. ‘గత కొన్ని రోజులుగా, వారాలు, నెలలు, ఏళ్లుగా నన్ను కొన్ని చాలా బాధపెడుతూ ఉన్నాయి.. ఇప్పుడు నేను వాటిపై మాట్లాడాలని అనుకుంటున్నా. అస‌లు ఇది ఎప్పుడో చేయాల్సింది. ఇప్పుడు కూడా నా కోసం మాత్రమే నేను మాట్లాడుతున్నాను.

నా కెరీర్ స్టార్ట్ చేసిన క్షణం నుంచి నెగెటివిటీ ఎక్కువ అవుతుంది. .. సాధార‌ణంగానే ట్రోల్స్, నెగెటివిటీ అనేది కామన్‌గా వస్తూ ఉంటాయి. అయితే నేను ఎంచుకున్న కెరీర్ అలాంటిదే అని నాకు తెలుసు.. పైగా నేను అందరికీ నచ్చాలని రూల్ కూడా ఏమీ లేదు.. అందరి ప్రేమ దక్కాలని కూడా ఎప్ప‌డు అనుకోను.. అలా అని.. వారి నుంచి నెగెటివిటీ వస్తూనే ఉంటుందంటే ఇక కుదరదు. ట్రోల్స్ అడుగ‌డుగునా అడ్డుప‌డుతుంటే నేను అనుకున్న ల‌క్ష్యాన్ని ఎలా సాధిస్తాను’’ అని ఓ లెట‌ర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు రష్మిక మందన్న. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ లెట‌ర్ నెట్టింట హల్‌చ‌ల్ చేస్తుంది.