Zodiac Signs : ఈ రాశుల వారు వజ్రాలు ధరిస్తే డబ్బే డబ్బు..!!

Zodiac Signs : అత్యంత విలువైన రత్నాలలో వజ్రం కూడా ఒకటి. అంతేకాదు ఎవరికైనా వజ్రం దొరికిందంటే చాలు వారి జన్మ ధన్యం అయినట్లే అని అందరూ చెబుతూ ఉంటారు. ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్రంలో పలాన రాశుల వారు ధరిస్తే అంతా శుభమే జరుగుతుందని చెబుతున్నారు. జాతకం ఆధారంగా ఏదైనా గ్రహ దశ ఆధారంగా వజ్రం లేదా రంగు రత్నాన్ని ఉపయోగించాలి అని నిపుణులు చెబుతున్నారు. అయితే అందరూ వజ్రాన్ని ధరించడం. కుదరదు.. కేవలం కొంతమందికి మాత్రమే ప్రయోజనకరంగా ఉంటే మరికొంతమందికి హానికరంగా కూడా ఉంటుంది. ముఖ్యంగా వజ్రం ధరించేటప్పుడు మీ జాతక చక్రం ప్రకారం ఒకసారి తెలుసుకోవాలి.

జాతక చక్రం ప్రకారం శుక్రగ్రహాన్ని బలోపేతం చేయడానికి అలాగే దాని ప్రతికూలతలను తగ్గించడానికి కూడా ఇస్తారు. వజ్రం ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాదు.. ప్రేమ సంబంధాలలో మాధుర్యాన్ని కూడా అందిస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కళ, మీడియా, ఫ్యాషన్ లేదా సినిమాతో సంబంధం ఉన్నవారు వజ్రాలను ధరించవచ్చు. వీరికి తమ కెరీర్లో శుభప్రదంగా ఉంటుంది. ఇక వృషభ , కన్య, మిధున , మకర , తుల , కుంభ రాశి వారు వజ్రాన్ని ధరించడం శుభప్రదం గా భావిస్తారు. తుల, వృషభ రాశుల కు శుక్రుడు అధిపతి కాబట్టి వారికి మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.

These zodiac signs are money if they wear diamonds
These zodiac signs are money if they wear diamonds

అయితే వజ్రాల ఉంగరాన్ని మీరు కొనుగోలు చేసినట్లయితే శుక్రవారం సూర్యోదయం తర్వాత ధరించాలి. మీరు ధరించడానికి ముందు పాలు , చక్కెర, తేనె కలిపిన నీటిలో ఉంచాలి. ఆ తర్వాత శుక్రుని మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఆ తర్వాత మీరు వేలికి ధరించాలు. ఇప్పుడు 20 నుంచి 25 రోజులలో దాని ప్రభావం చూపడం ప్రారంభమవుతుంది. ఏడు సంవత్సరాలకు ఒకసారి కొత్త వజ్రం ధరించేలా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి.ఇలాంటివన్నీ కూడా మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటాయి కానీ జాతకరీత్యా ఈ రాశుల వారికి తప్పకుండా శుభం కలుగుతుందని.. ఆర్థిక సంపద పెరుగుతుంది అని కూడా నిపుణులు చెబుతున్నారు.