Health Benefits : తామర పువ్వు నుంచి వచ్చే గింజలను తామర గింజలు అని పిలుస్తారు.. ఇందులో బోలెడు పోషక విలువలు ఉన్నాయి.. కొంతమంది వీటిని నేరుగా తినేస్తారు.. లేదంటే వేయించుకుని, ఉడక పెట్టుకుని తినచ్చు. మరి కొంతమంది కూరల్లో వాడుతూ ఉంటారు.. తామర గింజల వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటంటే..!మధుమేహంతో బాధపడుతున్న వారు తామర గింజలను తీసుకోవటం వలన రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుతుంది. గర్భిణీ, బాలింతలకు నీరసం రాకుండా చేయడమే కాకుండా తక్షణ శక్తిని అందిస్తుంది.
వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే మలినాలను,హానికర టాక్సిన్లను బయటకు నెట్టివేస్తాయి. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. క్యాన్సర్ కు దారితీసే ఫ్రీరాడికల్స్ ను నిరోధిస్తుంది. తామర గింజలలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవారు వీటిని తీసుకుంటే మెరుగైన ఫలితం ఉంటుంది. రక్తహీనతకు కూడా దూరం చేస్తుంది. అతిమూత్ర వ్యాధి సమస్యల నుంచి బయట పడేస్తుంది. టెన్షన్, ఒత్తిడి, అలసటను దూరం చేసి మానసిక ప్రశాంతతను అందిస్తుంది.తామర గింజల లో సోడియం తక్కువగా పొటాషియం ఎక్కువగా ఉంటుంది.
అందువల్ల వీటిని అధిక రక్తపోటు ఉన్నవారు రోజూ వారి ఆహారంలో తీసుకుంటే బ్లడ్ ప్రెషర్ నియంత్రణలో ఉంటుంది. కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారు వీటిని వారి డైట్ లో తీసుకుంటే నొప్పులను తగ్గిస్తుంది. ఈ విత్తనాలు నిద్రలేమి సమస్యకు చెక్ పెడుతుంది.వీటిని తింటే ఆకలిని పెంచుతుంది. డయేరియా ను నివారిస్తుంది. ఇన్ని ప్రయోజనాలు లోటస్ సీడ్స్ కొంతమంది ఆరోగ్యానికి నప్పవు. కడుపు ఉబ్బరం, గ్యాస్, అలర్జీ వచ్చే అవకాశం కూడా ఉంది.