Deepam : ఇంట్లో దీపం పెడుతున్నారా.. అయితే ఈ సూచనలు తప్పనిసరి..!!

Deepam : హిందూ సాంప్రదాయం ప్రకారం దీపానికి ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. చాలామంది మన దేశంలో సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తారు. అందుకే ప్రతిరోజు నిత్యం దేవుడిని పూజిస్తూ.. దేవుడి స్మరణ లోని జీవిస్తూ ఉంటారు. ఇక పోతే దీపం లేని ఏ ఇల్లు ఉండదు.. దీపం వెలిగించనిదే ఏ కార్యక్రమము జరగదు. ముఖ్యంగా దీపం వెలిగించిన తర్వాతనే అన్ని పనులు చేపడతారు. ఇక ప్రతిరోజూ దీపం పెట్టడం వల్ల ఇంట్లో ఆర్థిక సంపద సిరులు పెరగడమే కాకుండా లక్ష్మీ దేవి కటాక్షం లభిస్తుంది అని పండితులు చెబుతున్నారు. అయితే అలాంటి దీపం పెట్టేటప్పుడు కొన్ని సూచనలు తప్పనిసరిగా పాటించాలి. లేకపోతే ఇబ్బందులు చోటుచేసుకునే అవకాశం ఉంటుంది.

పరబ్రహ్మ స్వరూపం దీపం అని అంటారు . కాబట్టి దీపారాధన చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి . మరి ఆ దీపాన్ని వెలిగించే సమయంలో కూడా కొన్ని నియమాలు పాటించడం వల్ల మరిన్ని శుభ ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది అని పండితులు చెబుతున్నారు. దీపాలను ఎలా వెలిగించాలి అంటే ఉదయం, సాయంత్రం స్నానం చేసిన తర్వాత మాత్రమే దీపాలను వెలిగించాలి. ఏదైనా కారణం వల్ల సాయంత్రం సమయంలో దీపం చేయడానికి సాధ్యం కాకపోతే కాళ్లు, చేతులు శుభ్రం చేసుకుని, ముఖాన్ని శుభ్రంగా కడిగి ఆ తర్వాత దేవుడిని పూజిస్తే మంచి జరుగుతుంది.దీపం వెలిగించే ముందు నేరుగా అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగించకూడదు.

These tips while Deepam the house
These tips while Deepam the house

ముందుగా అగరవత్తుల తో దీపాన్ని వెలిగించి ఆ తర్వాత పూజ చేయడం వల్ల మంచి జరుగుతుంది. ఇకపోతే దీపం వెలిగించే టప్పుడు కూడా రెండు ఒత్తులను కలిపి దీపం పెట్టాలి. దీపం రాగి, వెండి, ఇత్తడి , మట్టి ప్రమిదలలో వెలిగించడం తప్పనిసరి. ఇలా చేస్తే ఫలితాలు లభిస్తాయి. ఇక ఇంట్లో శాంతి నెలకొనడమే కాకుండా పిల్లలు వృద్ధిలోకి వస్తారు . వారిలో జ్ఞానం కూడా పెరుగుతుంది. దీపం అనేది ఇల్లాలి యొక్క స్వభావాన్ని కూడా తెలియజేస్తుంది. ఇక ఇంటి పెద్ద బయటకు వెళ్ళినప్పుడు ఆ ఇల్లాలికి తోడుగా దీపం ఉంటుంది అని శాస్త్రం చెబుతోంది. కాబట్టి అత్యంత ప్రాధాన్యత ఉన్న దీపాన్ని ఉదయం, సాయంత్రం తప్పకుండా వెలిగించడం తప్పనిసరి.