Lakshmi Devi : ఇంట్లో డబ్బుకు లోటు ఏర్పడకూడదు అంటే తప్పకుండా లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందాలి

Lakshmi Devi : ఇంట్లో డబ్బుకు లోటు ఏర్పడకూడదు అంటే తప్పకుండా లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందాలి. మరి లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందాలి అంటే కొన్ని వాస్తు చిట్కాలు పాటించాలి. జీవితంలో విజయం సాధించాలన్నా.. ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలన్నా డబ్బు అనేది చాలా అవసరం. ఇక వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని చిట్కాలు పాటిస్తే తప్పకుండా మీ ఇంట్లో డబ్బు కు ఎటువంటి లోటు ఉండదు. అలాంటి వాటిలో వాస్తు ప్రమాణాలలో ఒకటి ఇంటి అల్మరా. సాధారణంగా ప్రతి ఇళ్ళల్లో కూడా డబ్బు, నగలు దాచుకోవడానికి ఒక అల్మరా ఉంటుంది. డబ్బుతో పాటు కొన్ని వస్తువులను ఇంట్లో అల్మారాలలో పెట్టాలి. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం కొన్ని వాస్తు సూచనలు కూడా పాటించాలి.

కుబేర యంత్రం వాస్తు శాస్త్రం ప్రకారం అత్యంత ప్రభావవంతమైన ది గా పరిగణించబడుతుంది. ఇక కుబేర యంత్రం ఇంట్లో ఉండడం వల్ల సంతోషం, ఐశ్వర్యం , సంపద అన్నీ కలుగుతాయి. ఇక ఇంట్లో అల్మారాలో కుబేర యంత్రం పెట్టుకోవడం వల్ల ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు. పైగా కొత్తగా డబ్బు రావడానికి మార్గాలు ఏర్పడతాయి. ఇక మీ ఇంట్లో తామర పువ్వు పెట్టడం వల్ల కూడా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక పూజా సమయంలో తామర పూలు లక్ష్మీదేవికి అంకితం చేస్తే అమ్మవారు అనుగ్రహించి సిరులు కురిపిస్తోంది . ఇక తామరపువ్వు ఎండిపోయిన వెంటనే మరొక పువ్వు ఆ ప్రదేశంలో ఉంచాలి.

There should be no deficit of money in the house which means surely Lakshmi devi is blessed
There should be no deficit of money in the house which means surely Lakshmi devi is blessed

ఎప్పుడైతే లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ పువ్వులను మీరు లక్ష్మీదేవి పూజలు సమర్పిస్తారో అప్పుడు కచ్చితంగా మీ కష్టాలు తొలగిపోతాయి.వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో అమర్చబడిన అద్దం ప్రతికూల లేదా సానుకూల శక్తి వస్తుంది కాబట్టి మీరు అద్దాన్ని ప్రతికూల శక్తులు దూరమవుతాయి. లేకపోతే ఆర్థిక కష్టాలు తప్పవు.. కార్డ్ బోర్డ్ పై చిన్న అద్దం ఉంచడం వల్ల డబ్బు ఆదా అవుతుంది. ఇక ఎరుపు గౌను లక్ష్మీదేవి యొక్క దుస్తులు గా పరిగణించ బడుతుంది కాబట్టి అమ్మవారి అనుగ్రహం పొందాలి అంటే ఎర్రటి వస్త్రాన్ని ఉంచాలి ఇలా ఉంచితే ఆదాయం కూడా పెరుగుతుంది.