Mahabharata : మహాభారతాన్ని తలపించే నేటి నగరాలు ఎక్కడ ఉన్నాయో తెలుసా..?

Mahabharata : 18 పర్వాలు..ఎందరో మహా నాయకులు , ప్రతినాయకులు అనుకోని బంధాలు..అనుబంధాలు, ఈర్ష , సమస్త యుగాన్ని సాధించిన ఒక ప్రపంచమే కనివిని ఎరుగని ఒక మహాసంగ్రామం. ఒక యుగానికి అంతం.వీటన్నిటితో కూడిన మహా కావ్యమే ఈ మహాభారతం. మానవజాతి ఎలా ఉండాలో .. ఎలా ఉండకూడదో కళ్లకు కట్టినట్టుగా చూపించిన మహాభారతం అపురూపం, అజరామరం. భారతదేశం ఘన చరిత్రకి పట్టుకొమ్మ అయిన ఇతిహాసం అని చెప్పవచ్చు. అయితే కొంతమంది మాత్రం ఇది నిజము కాదని కేవలం కథ మాత్రమే అన్నట్లుగా వాదిస్తున్నారు. అయితే వారి నోళ్లు మూయించేలా.. కొన్ని ఆధారాలు బయటపడ్డాయి.

Advertisement
Do you know where the cities of today that represent the Mahabharata
Do you know where the cities of today that represent the Mahabharata

పాశ్చాత దేశాలలో వస్త్రాలు కూడా కట్టుకోలేని ఆ కాలంలో.. ఈ భరత ఖండంపై భరత సామ్రాజ్యాలను , సైన్స్ కి కూడా అందని ఆయుధాలను, విమానాలను తయారు చేశారనే నిజాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. మహాభారతం ఎక్కడ జరిగింది అందులో చెప్పబడిన నగరాలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి అనే నిజాలు ఈ మధ్య కాలంలోనే బయటపడ్డాయి. ఆ నగరాలు ఏమిటి.. ? అవి ఎక్కడ ఉన్నాయి..? వాటి గురించి ఇప్పుడు పూర్తిగా మనం తెలుసుకుందాం.

Advertisement

1). గాంధారం : మహా భారతంలో పేర్కొనబడిన గాంధార దేశం.. ఇప్పుడు ఉన్న ఆఫ్ఘనిస్తాన్లో ఖందర్ గా గుర్తించారు. ఆదేశ ముఖ్య నగరం తక్షశిల గా పేర్కొన బడింది. ఈ నగరం ఇప్పుడున్న పాకిస్థాన్ లో ఉన్నది. ఈ రాష్ట్రం నుండి ధృతరాష్ట్ర మహారాజు భార్య.. కౌరవ సోదరులకు మామ అయిన.. శకుని వచ్చారు.

Do you know where the cities of today that represent the Mahabharata
Do you know where the cities of today that represent the Mahabharata

2). మాధ్ర : మహాభారతంలో ముఖ్య రాజ్యం మాధ్ర. ఈ రాజ్యం నుండి పాండురాజు రెండవ భార్య అయిన మాధురి వచ్చింది. ఈవిడ నకుల సహా దేవు లకు తల్లి. ఈమె అన్న గారు అయినా సెయ్యుడు మాధ్ర రాజ్యానికి రాజుగా ఉండేవారు. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల పక్షాన చేరి కూడా.. కర్ణుడి చావుకి కారకుడయ్యాడు.ఆ తరువాత ధర్మరాజు చేతిలో హతమయ్యాడు. ఈ మాధ్ర రాజ్యం హిమాలయాలలోని టిబెట్, చైనా లో కొంత భాగం వ్యాపించి ఉన్నట్లు తెలుస్తోంది.

3). ఉజ్జనక : ఈ ప్రాంతం ఉత్తర ప్రదేశ్ లోని నైనిటాల్ జిల్లాలో కాశీ కి సమీపంలో ఉన్నది. ఈ ప్రాంతంలోనే ద్రోణాచార్యుడు కౌరవులకు , పాండవులకు అస్త్ర శస్త్ర విద్యలన్నీ నేర్పినట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతానికి సమీపంలో స్వయంగా భీముడే ఒక శివలింగాన్ని స్థాపించి.. పూజించినట్లు అక్కడ స్థలపురాణం తెలియజేస్తోంది. ఇప్పుడు అక్కడ శివలింగం ఉండే ప్రాంతాన్ని భీమ శివలింగంగా పిలుస్తున్నారు.

4). షివినగరం : ప్రస్తుతం ఈ నగరం పంజాబ్ కి ఉత్తరాన ఉన్నది. ఈ రాజ్యాన్ని సాయస్ అనే రాజు పాలించినట్లు గా తెలుస్తోంది. ఇక ఈయన పెద్ద కుమార్తె దేవికని పాండవులలో అగ్రజుడైన ధర్మరాజుకి ఇచ్చి వివాహం చేసినట్లు మహాభారతంలో తెలుస్తోంది.

5). వర్ణవట్ : ఈ ప్రాంతం ఉత్తర ప్రదేశ్ లోని మీరట్ నగరానికి సమీపాన గంగా నది ఒడ్డున ఉన్నది. పాండవులు గురు పెద్దలను అడిగిన 5 ఊర్లలో ఇది కూడా ఒకటి. ఈ ప్రాంతంలో దుర్యోధనుడు.. పాండవులను చంపడానికి లక్క తో తయారు చేసిన ఒక ఇంటిని నిర్మించాడు.

6). పాంచాల దేశం : ఈ ప్రాంతం హిమాలయాలలోని చర్మన్వతి అనే నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నది. ఈ ప్రాంతాన్ని ద్రుపద మహారాజు పరిపాలించినట్లు.. ఆయన కుమార్తె అయిన ద్రౌపదిని పాండవులు వివాహమాడినట్లు మహాభారతంలో పేర్కొనబడింది.

7). ఇంద్ర ప్రస్థానం : ఈ నగరాన్ని పాండవులు నిర్మించిన తొలి నగరం గా చెప్పవచ్చు.. ఇప్పుడు ఈ నగరం మన దేశ రాజధాని అయిన ఢిల్లీ కి దక్షిణాన ఉన్నదని చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది.

8) మథుర : బలరామ కృష్ణు సోదరుడు కృష్ణుడు మొదట పాలించిన రాజ్యం అని మనందరికీ తెలుసు. తన మేనమామ కంసుడిని చంపి మథుర రాజ్యాన్ని పరిపాలించారు. ఇప్పుడు ఈ ప్రాంతం ఉత్తర ప్రదేశ్ లో ఆగ్రాకి సమీపంలో ఉన్నది. జరాసంధుడితో జరిగిన యుద్ధాల నుండి తన ప్రజలను కాపాడుకునేందుకు గుజరాత్ లో సముద్రపు ఒడ్డున ద్వారక అనే నగరాన్ని నిర్మించాడు కృష్ణుడు. ఇప్పుడు కూడా ఈ నగరం గుజరాత్లోని దేవభూమి అనే ద్వారక జిల్లాలో ఉన్నది. అయితే కృష్ణుడు పాలించిన అసలు ద్వారక ఈ సమీపంలోని సముద్రం లోపల ఉన్నట్లు పురావస్తు శాస్త్రాల పరిశోధనల ద్వారా బయటపడింది.

9). అంగ దేశం : ఈ ప్రాంతాన్ని దుర్యోధనుడు.. కర్ణుడికి బహుమతిగా ఇస్తారు. ఈ నగరం ఉత్తరప్రదేశ్లోని గొండ జిల్లాలో ఉన్నట్లు చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది.

10). మగధ : ఈ ప్రాంతం ప్రస్తుతం ఉన్న దక్షిణ బీహార్ అని పిలుస్తూ ఉంటారు. ఈ ప్రాంతాన్ని జలసంధుడు పాలించినట్లు పురాణాలు తెలియజేస్తున్నాయి.

11). కాశీ : మహాభారతంలో కాశీ గురించి ఎన్నోసార్లు ప్రస్తావన రావడం జరిగింది. ఈ పుణ్యక్షేత్రం ఎక్కడ ఉందో మనందరికి తెలిసిన విషయమే.ఇవే కాకుండా మరికొన్ని కూడా ఉన్నాయి.

Advertisement