Health Benefits : ఆరోగ్యాన్ని పెంచే గుమ్మడి గింజలు.. ఎలా తినాలంటే..?

Health Benefits : పూర్వకాలం నుంచి అనాదిగా వస్తున్న ఆచారం ఏమిటంటే.. దిష్టి తీయడానికి గుమ్మడికాయను ఎక్కువగా ఉపయోగిస్తారు అని అందరికీ తెలుసు. ముఖ్యంగా సంక్రాంతి పండుగనాడు కచ్చితంగా గుమ్మడికాయ తో ఇంటికి దిష్టి తీస్తారు. కేవలం పండుగలు పర్వదినాలలో మాత్రమే కాకుండా ఏదైనా కొత్తగా వాహనాలు కొనుగోలు చేసినప్పుడు లేదా కొత్తగా వ్యాపారం మొదలు పెట్టినప్పుడు కూడా ఎటువంటి ఆటంకం కలగకుండా గుమ్మడికాయతో దిష్టి తీస్తూ ఉంటారు. ఇక దూరప్రయాణాలు నుంచి కొన్ని సంవత్సరాల తర్వాత ఇంటికి తిరిగి వచ్చే వారికి కూడా ఇలా గుమ్మడికాయతో దిష్టి తీయడం ఆనవాయితీ. అయితే గుమ్మడికాయ కేవలం నరదిష్టి ని దూరం చేయడానికి మాత్రమే కాదు ఆరోగ్యాన్ని , అందాన్ని పెంపొందించడానికి కూడా ఉపయోగిస్తారు. గుమ్మడి కాయను మాత్రమే కాదు గుమ్మడి గింజలతో కూడా మరింత ఆరోగ్యం మెరుగుపడుతుంది.. అయితే వీటిని ఎలా తినాలి.. ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయాలను ఒకసారి తెలుసుకుందాం..

గుమ్మడి గింజలలో లభించే పోషకాలు : గుమ్మడి గింజలలో ఎలాంటి పోషకాలు లభిస్తాయి అంటే కాపర్ , మెగ్నీషియం, ప్రోటీన్స్ , జింక్ , ఫైబర్ , ఫ్యాటి యాసిడ్స్ , యాంటీ ఆక్సిడెంట్ , కెరటోనాయిడ్స్, విటమిన్ ఇ, ట్రైప్టో ఫాన్ వంటి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. ఇకపోతే ఈ పోషకాలు వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయం ఇప్పుడు చూద్దాం.

Health Benefits of Pumpkin Seeds
Health Benefits of Pumpkin Seeds

అధిక బరువు : ఈ మధ్య కాలంలో అధిక బరువు ప్రతి ఒక్కరికి పెద్ద సమస్యగా మారింది. ఇక తమ రోజువారి డైట్ లో చేర్చుకోవడం వల్ల అధిక బరువును నియంత్రించుకోవడం ఎలా అంటే ఈ గింజలలో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. బరువు పెరుగుదలను నియంత్రిస్తుంది. కొన్ని గింజలు తిన్నా సరే పొట్ట నిండిన భావన కలుగుతుంది. అందువల్ల ఇక ఎలాంటి చిరుతిండ్లు తినాలనిపించదు. ఫలితంగా అధిక బరువు అదుపులోకి వస్తుంది. అంతే కాదు జీర్ణక్రియను వేగవంతం చేయడానికి కూడా గుమ్మడి గింజలు పనిచేస్తాయి.

దృఢమైన ఎముకలు : గుమ్మడి గింజల్లో మెగ్నీషియం లభిస్తుంది. కాబట్టి ఈ ఎముకల తయారీకి మెగ్నీషియం చాలా అవసరం. ముఖ్యంగా ఎంత ఎక్కువ మెగ్నీషియం తీసుకుంటే అంత దృఢంగా ఎముకలు పటిష్టంగా తయారవుతాయి. ఇక అప్పుడప్పుడు వచ్చే ఆస్టియోపొరోసిస్ వంటి ఎముకలు చెట్లిపోయే వ్యాధులు కూడా దరిచేరవు. కాబట్టి ఎముకలకు సంబంధించి సమస్యలు రాకుండా ఉండాలి అంటే గుమ్మడి గింజలు తినాల్సిందే.

డయాబెటిస్ : వందలో 70 మంది తాజాగా డయాబెటిస్ బారిన పడుతున్నారు . అలాంటి వారు తమ రక్తంలో షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేసుకోవాలి అంటే గుమ్మడి గింజలు తప్పకుండా తినాల్సిందే. మొదట్లో పరిశోధన జరిగినప్పుడు ఎలుకలపై ప్రయోగాలు చేయగా.. వాటి రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అందుకే మనుషులకు అయినా సరే ఇవి చక్కగా పనిచేస్తాయి అని డాక్టర్లు సైతం తెలియజేస్తున్నారు.

గుండె : గుమ్మడి గింజల్లో లభించే జింక్ , మెగ్నీషియం, ఫ్యాటీ యాసిడ్స్ , యాంటీ ఆక్సిడెంట్ వల్ల గుండెకు మేలు జరుగుతుంది. ఇక ఈ గింజలలో నీటిలో కరిగిపోయే ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం వల్ల అవి రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి.. అలాగే మంచి కొలెస్ట్రాల్ ను పెంచడానికి సహాయపడతాయి. ఫలితంగా గుండెపోటు, రక్తపోటు వంటి సమస్యలు దరిచేరవు.

రోగ నిరోధక శక్తి : వీటిలో ఉండే కెరటోనాయిడ్స్, విటమిన్ ఈ శరీరంలో వేడిని తగ్గిస్తాయి . జ్వరం , జలుబు వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు. అలాగే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నిద్రలేమి సమస్య కూడా దూరం అవుతుంది.

ఇక ఎలా తినాలి అనే విషయానికి వస్తే.. గుమ్మడి గింజలను పచ్చిగా అయినా తినవచ్చు లేదా వేపుకొని స్నాక్స్ లాగా అయినా కూడా తినవచ్చు. సలాడ్స్ , సూప్స్ లలో కూడా వీటిని వేసుకొని తినవచ్చు. ఎలా తిన్నా సరే గుమ్మడి గింజలు తినడం వలన ఖచ్చితంగా మంచి ఫలితాలు లభిస్తాయి. అందుకే సాధ్యమైనంత వరకు గుమ్మడి గింజలను తినడానికి అలవాటు చేసుకోండి.అప్పుడే మీ శరీరానికి అన్ని ప్రయోజనాలు లభిస్తాయి.