Health Benefits : వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ ఎందుకు మంచిది.. తేడా ఏంటో తెలుసా..?

Health Benefits : అనాదికాలం నుంచి ఎక్కువగా వైట్ రైస్ ను ఉపయోగిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా అన్నం తినడానికి చాలా మంది ఎక్కువ మక్కువ చూపుతారు. మరీ ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలో అయితే మూడుపూటలా అన్నం తినడానికి ఇష్టపడతారు. ఒకవేళ ఏదైనా ఆహారం తీసుకున్నప్పటికీ ఒక ముద్ద అన్నం తిననిదే కడుపు నిండిన భావన కలగదు. కాబట్టి ఎక్కువగా వైట్ రైస్ తింటారు. మరి ఉత్తర భారతదేశం విషయానికి వస్తే వారు రొట్టెలు.. చపాతీలతో జీవితాన్ని గడిపేస్తారు.. కేవలం రోజులో ఒక్క సారి మాత్రమే అన్నం తినడానికి ఆసక్తి చూపుతారు. కానీ దక్షిణ భారత దేశ ప్రజలకు అన్నం తిననిదే కడుపు నిండిన భావన కలగదు.. పైగా ఆకలి తీరినట్లు అనిపించదు ..ముఖ్యంగా ప్రశాంతంగా ఉండదు కూడా..కానీ తాజాగా జరిగిన ఒక అధ్యయనం ప్రకారం వైట్ రైస్ ఆరోగ్యానికి అంత మంచిది కాదట. ఎందుకంటే వీటిలో ఉండే కేలరీలు మనల్ని అనేక ఇబ్బందులకు గురి చేస్తాయని అధ్యయనంలో వెల్లడైంది.

మరీ ముఖ్యంగా వేసవి కాలంలో ఎక్కువగా వైట్ రైస్ తింటే బరువు పెరిగే అవకాశం కూడా ఉంటుంది.. ఇక బరువు పెరగ కూడదు అంటే వైట్ రైస్ ను మానేయమని చెప్పడం కాదు బ్రౌన్ రైస్ తినమని సలహా ఇస్తున్నారు. అయితే వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ ఎందుకు మంచిదో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాంఎవరైనా డయాబెటిస్ బారిన పడిన వారికి ఎక్కువగా బ్రౌన్ రైస్ తినమని వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు. వైట్ రైస్ తో పోల్చుకుంటే బ్రౌన్ రైస్ లో ఎక్కువ పోషకాలు ఉంటాయి. కానీ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగా పండించే పంట కేవలం వైట్ రైస్ మాత్రమే. అందుకే ప్రతి ఒక్కరూ వైట్ రైస్ తినడానికి ఆసక్తి చూపుతారు. కానీ వైట్ రైస్ తో పోల్చుకుంటే బ్రౌన్ రైస్ లో ఎక్కువ ఫైబర్ కటెంట్ యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు లభిస్తాయి. ముఖ్యంగా 100 గ్రాములు వండిన బ్రౌన్ రైస్ లో మనకు 1.6 గ్రాముల ఫైబర్ లభిస్తుంది. కానీ 160 గ్రాముల వైట్ రైస్ లో మనకు కేవలం ఒక గ్రాము కంటే తక్కువ ఫైబర్ కలిగి ఉంటుంది.

Health Benefits of Why Brown Rice is Better Than White Rice
Health Benefits of Why Brown Rice is Better Than White Rice

ఇక వైట్ రైస్ తో పోల్చుకుంటే బ్రౌన్ రైస్ లో మెగ్నీషియం, ఫైబర్ అధికంగా ఉండడం వల్ల ఈ రెండూ కూడా రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు గోధుమలతో తయారు చేసిన రొట్టెలు తినాలని చెబుతూ ఉంటారు. అంతేకాదు డయాబెటిస్ ఉన్న వారిని వైట్ రైస్ తక్కువగా తినమని వైద్యులు సలహా ఇస్తారు. ఇక అలాంటప్పుడు బ్రౌన్ రైస్ తింటే ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది. అధిక బరువును తగ్గించుకోవడానికి కూడా బ్రౌన్ రైస్ చాలా బాగా సహాయపడుతుంది. బ్రౌన్ రైస్ లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అలాగే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు.. ఆస్తమా, ఆర్థరైటిస్ వంటి సమస్యలతో పోరాడ తాయి.శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తొలగించడానికి బ్రౌన్ రైస్ సమర్థవంతంగా పనిచేస్తుంది.

ఇకపోతే తక్కువ క్యాలరీలు ఆహారం తీసుకునే వ్యక్తులు.. శుద్ధిచేసిన ధాన్యాలు తినేవారిలో కంటే వేగంగా పొట్టను తగ్గించుకోగలరు. అంతేకాదు నిత్య యవ్వనంగా ఉండటమే కాకుండా వీరిని వృద్ధాప్య లక్షణాలు అంత త్వరగా దరిచేరవు. ఇక సెలబ్రిటీలు కూడా 40 సంవత్సరాలు దాటినా కూడా ఇంత అందంగా, యవ్వనంగా కనిపించడానికి కారణం కూడా బ్రౌన్ రైస్ అని అప్పుడప్పుడు వారు చెబుతూ ఉంటారు. శరీరం ఫిట్ గా ఉండడమే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉంటుంది. తాజాగా అధ్యయనంలో వెల్లడైన విషయం ఏమిటంటే బ్రౌన్ రైస్ తినే వారి కంటే వైట్ రైస్ తినే వారు త్వరగా వృద్ధాప్యం కి గురి అవుతున్నారు అని.. త్వరగా ముడతలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి సాధ్యమైనంత వరకు కొంచెం ధర ఎక్కువ అయినప్పటికీ బ్రౌన్ రైస్ తినడానికి అలవాటు పడండి.