Devotion : భక్తుల కోర్కెలు తీర్చి కొంగు బంగారం చేసే తెలంగాణ ఇల వేల్పు యాదగిరి గుట్ట.. యాదాద్రి లో కొలువున్న శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ బ్రహ్మోత్సవాలు శోభాయ మానంగా జరుగుతున్నాయి నిన్న ఉదయం 11 గంటలకు వైభవంగా లక్ష్మీనరసింహస్వామి అంగరంగ వైభవంగా జరిగింది నమో నారసింహ మంత్రంతో యాదగిరిగుట్ట క్షేత్రం మారు మోగింది.. శ్రీకర, శుభకర, ప్రణభ స్వరూప, శ్రీ లక్ష్మీనరసింహ నమో నమః అంటూ జయ జయ ధ్వనులు మారుమోగాయి.. యావత్ భక్తజనం స్వామికి ప్రణమిల్లింది..
స్వామి వారి కళ్యాణాన్ని తిలకిస్తే ఎంతటి కష్టాలైనా తొలగిపోతాయని నమ్మకం. యాదాద్రి నరసన్న ఉగ్ర, దండబేరుండ, జ్వాల, యోగానంద , లక్ష్మీ సమేత ఐదు రూపాయలలో నరసింహస్వామిని కొలుస్తారు.. స్వామివారి కల్యాణోత్సవ వేల యాదాద్రి సర్వాంగ సుందరంగా షోబిల్లుతోంది భక్తజనమంతా లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ ఘట్టాన్ని కనులారా చూసి ధన్యులయ్యారు. ఆధ్యాత్మిక కళాక్షేత్రము ముక్కోటి దేవతల స్వర్ణ నిలయం ఆధ్యాత్మిక దైవ మందిరం. దివ్య క్షేత్రమైన యాదాద్రి గుట్ట లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం భక్తజనుల మధ్య ఘనంగా నిర్వహించారు. స్వామివారిని శ్రీ లక్ష్మీనరసింహ నమో నమో అంటూ భక్తులు స్వామివారి నామంతో యాదాద్రి మొత్తం వినిపించాలా హరినామ స్మరణ చేశారు. స్వామివారి కళ్యాణం కనులారా తిలకించడం అక్కడికి వెళ్లిన వారి భాగ్యం.
యాదగిరి క్షేత్రం చూస్తుంటే ఒకవైపు స్వర్ణ శోభిత నిలయంగా ఆకుపచ్చ తోరణంల భక్తి భావం పెంపొందుతోంది.. నిన్న జరిగిన లక్ష్మీదేవి నరసింహ స్వామి కళ్యాణం కనులారా వీక్షించిన భక్తుల జన్మల ధన్యం. ఈ కళ్యాణ ఘట్టాన్ని ప్రజలందరూ వీక్షించేలాగా లైవ్ కూడా పెట్టారు కమిటీ వారు.. జీవితంలో ఓసారైనా యాదాద్రి నరసింహ స్వామిని దర్శించుకోవాలని పెద్దలు చెబుతూ ఉంటారు. ఆయన దగ్గరకు వెళ్తే సకలభీతి బాధలు తొలగిపోయి సకల సంపదలను కలిగిస్తాడని ప్రతిదే అటువంటి లక్ష్మీనరసింహస్వామి కళ్యాణి కనులారా వీక్షించే మనం కూడా తరిద్దాం..