Amitab :బాలీవుడ్ లో అగ్ర నటులలో ఒకరైన అమితాబ్ బచ్చన్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. మరొక నటుడు ధర్మేంద్ర ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. తాజాగా వీరి నివాసానికి బాంబు బెదిరింపులు వచ్చాయని తెలుస్తోంది. ఈ నటుల ఇంటి వద్ద బాంబులు పెట్టినట్టుగా నాగపూర్ పోలీస్ కంట్రోల్ రూమ్ కు కొంతమంది ఆగంతకులు ఫోన్ చేసి నాగపూర్ పోలీసులను అప్రమత్తం చేశారు. ఈ విషయాన్ని ముంబై పోలీసులకు నాగపూర్ పోలీసులు సమాచారాన్ని తెలియజేయడం జరిగింది.
ఇక దీంతో పోలీసులు ముంబై నగరంలో భద్రతను చాలా కట్టుదిట్టం చేసినట్లుగా తెలుస్తోంది. ముంబై పోలీసులు వెంటనే అమితాబ్ ధర్మేంద్రాల నివాసానికి వెళ్లి తనిఖీలు చేయడం జరిగింది. అయితే అనుమానించదగ్గ వస్తువులేమీ అక్కడ కనిపించలేదని రంగంలోకి దిగిన కొంతమంది సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ అధికారులు ఫోన్ కాల్ ఆధారంగా నిందితులు ఆచూకీ తెలుసుకునేందుకు పలు ప్రయత్నాలు చేస్తున్నారు. అమితాబ్ బచ్చన్ కి ముంబైలో ఐదు విలాసవంతమైన ఇల్లు ఉన్నాయి. ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ కుటుంబం మొత్తం జల్సా నివాసంలో ఉంటున్నట్లు తెలుస్తోంది . మరొకవైపు ధర్మేంద్ర కూడా జూహు లోని బంగ్లాలో నివాసముంటున్నట్లుగా తెలుస్తోంది.