Solar Eclipse : త్వరలో సూర్యగ్రహణం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పనులు చేయకండి..!

Solar Eclipse : 2022 కొత్త సంవత్సరం మొదలైన తరువాత మొట్టమొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 30వ తేదీన ఏర్పడనుంది . భూమికి.. సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు భూమి మీద కొంత భాగానికి సూర్యుడు పూర్తిగా గానీ పాక్షికంగా గానీ కనపడకుండా పోవడాన్ని మనం సూర్య గ్రహణం అని అంటారు. సూర్య గ్రహణం అంటే అమావాస్య రోజున ఏర్పడుతుంది అని అందరికీ తెలిసిందే. ఇక హిందూ సాంప్రదాయం ప్రకారం గ్రహాలను అశుభ సూచకంగా పండితులు భావిస్తారు . అందుకే సూర్యగ్రహణం ఏర్పడే సమయంలో జీవితంలో ఆనందం ,శాంతి ఉండడం కోసం కొన్ని పూజలను, పరిహారాలను కూడా సూచిస్తూ ఉంటారు.

ముఖ్యంగా దేవాలయాలను కూడా మూసి వేయడం జరుగుతుంది. ఇక ఇలాంటి రోజున ప్రత్యేకించి కొన్ని పనులను చేయకుండా ఉండడమే మంచిదట. సూర్య గ్రహణం రోజున ఎలాంటి పనులు చేయాలి.. ఎలాంటి పనులు చేయకూడదు అనే విషయాలను కూడా ఒకసారి మనం చదివి తెలుసుకుందాం.ఏప్రిల్ 30వ తేదీన భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:15 గంటలకు సూర్య గ్రహణం ప్రారంభమై . సాయంత్రం 4:07 గంటల వరకు కొనసాగుతుంది అంటే భారతదేశంలో పాక్షికంగా సూర్యగ్రహణం వీక్షించవచ్చు. ఇక ఈ సూర్యగ్రహణం ఎక్కువగా కనిపించే దేశాలలో పశ్చిమ అమెరికా , దక్షిణ అమెరికా , పసిఫిక్ అట్లాంటిక్ , అంటార్కిటికాలు కాగా భారతదేశంలో ఈ గ్రహణం ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది.

Soon solar eclipse Do not do these things under any circumstances
Soon solar eclipse Do not do these things under any circumstances

అయినప్పటికీ కూడా మనం కొన్ని పనులు చేయకుండా ఉండడమే మంచిది అని పండితులు చెబుతున్నారు.గ్రహణకాలంలో ప్రతికూల శక్తి పెరగడం కారణంగా గృహప్రవేశం , శుభకార్యాలు లాంటివి చేయడం మానుకోవాలి . అలాగే ఎటువంటి పదునైన వస్తువులను కూడా ఉపయోగించకూడదు. ఇక ఈ సమయంలో గర్భిణీ స్త్రీలు బయటకు రాకూడదు. అలాగే సూదిలో దారం ఎక్కించడం, కుట్టు పని చేయడం, కత్తెర, కత్తి వంటి వాటిని అసలు ఉపయోగించకూడదు. గర్భిణీ స్త్రీలు కూడా ఇలాంటి పనులు చేయకుండా దూరంగా ఉండాలి. అలాగే గ్రహణం సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా అల్పాహారం కానీ భోజనం కానీ చేయకూడదు. ఇక ఈ సమయంలో అసలు నిద్రించకూడదు అని పండితులు చెబుతున్నారు.