Raja Ram Mohan Roy: చరిత్ర నిజాలు : రాజా రామ్మోహన్ రాయ్ చేసిన ఆ పని కి ప్రతి ఒక్క స్త్రీ చేతులెత్తి మొక్కావలిసిందే!!

Raja Ram Mohan Roy: బాల్యము
1772 లో రాయ్ రాథానగర్, బెంగాల్ లో పుట్టారు. అయన కుటుంబములో మతపరమైన వైవిధ్యము ఉండేది.ఆయన తండ్రి రమాకాంత్ ఒక వైష్ణవుడు కాగా, తల్లి తరిణి శాక్తమతస్తురాలు. రామ్మోహన్ బెంగాలీ, అరబిక్, పర్షియన్, సంస్కృత భాషలనుపదిహేనోసవత్సరం వరకు చదువుకున్నారు.యుక్తవయస్సు లో కుటుంబ ఆచారాముల తో సంతృప్తి పొందలేక యాత్రలు చేయడం మొదలుపెట్టారు. ఆ తరువాత కుటుంబ ప్యవహారములు చూసుకోవడానికి తిరిగి వచ్చి కలకత్తా లో వడ్డీ వ్యాపారం చేసారు. 1803 – 1814 వరకు బ్రిటిష్ వారి ఈస్టిండియా కంపెనీ లో పని చేసారు.

Raja Ram Mohan Roy:మొదటి సామాజిక-మత సంస్కరణ:

రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజ్ ను , భారతదేశము లో మొదటి సామాజిక-మత సంస్కరణ ఉద్యమాలను మొదలు పెట్టారు.ఆయన యొక్క విశేషమైన ప్రభావము రాజకీయ, ప్రభుత్వ నిర్వహణ, విద్య రంగముల లో మాత్రమే కాకుండా హిందూ మతము పైన కూడాకనబడుతుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు.రాజా రామ్మోహన్ రాయ్ ఒక గొప్ప సంఘసంస్కర్త.
ప్రముఖ సాంఘిక దురాచారం :
బ్రిటీష్ ఇండియా కాలంలో ఉన్న అప్పటి ప్రముఖ సాంఘిక దురాచారమైన సతీసహగమనాన్నిమట్టు పెట్టడానికి ఎంతో కృషి చేసారు. దానితో పాటు వితంతువుల పునర్వివాహానికి సైతం మద్దతు మద్దతుగా నిలిచారు. సమాజం లో ఉన్న స్త్రీ ల చదువులు కోసం పాటుపడ్డాడు. ఆంగ్ల విద్యకు అనుకూలంగా ఉండి దేశంలో ఆంగ్ల విద్యావిధానానికి తన వంతు కృషిచేశాడు.

బ్రహ్మ సమాజ స్థాపన :

1828 లో ఆయన ఇంగ్లాండు కు వెళ్ళక ముందు ద్వారకా నాథ టాగూర్ తో కలసి బ్రహ్మసమాజ్ ను స్థాపించారు. బ్రహ్మసమాజ్ అనేది ఒక ముఖ్యమైన ఆధాత్మిక, మత సంస్కరణ ఉద్యమముగా మారి బెంగాల్ లో ఉన్న సాంఘిక , వివేచనాత్మక సంస్కరణ లకు కారణం గా నిలిచింది. వీటన్నిటి కారణం గా రాజా రామ్మోహన్ రాయ్, బెంగాల్ లో ఒక ప్రముకమైన వ్యక్తిగా గుర్తించ బడ్డారు. ఇంకా చెప్పాలి అంటే భారత సంఘ సంస్కరణల చరిత్ర లో నే సతీసహగమనము ను రూపుమాపడము తో రామ్మోహన్ రాయ్ చిరస్థాయి గా నిలిచిపోతుంది. ఆ కాలములో చాలా సాధారణమైన బహు భార్యత్వము నేరమని జనులకు నచ్చ చెప్పెను.

తానుచేపట్టిన సామాజిక, న్యాయ, మతపరమైన ఉద్యమాలలో రాయ్ మానవత్వము నే ప్రధాన అంశం గా తీసుకున్నారు.తన ఉద్దేశ్యము సమాజము లో ఉన్న మంచి సాంప్రదాయములను నిర్మూలించడము కాదని, కేవలము వాటిపై సంవత్సరముల పాటు నిరాధరణ వలన పేరుకు పోయిన కుళ్ళును తుడిచివెయ్యడము అని ప్రజలకు చూపించడం కోసం చాలా కష్టపడ్డారు.
ఆధాత్మిక చింతన:
ఉపనిషత్తులను గౌరవించి, సూత్రములను చదివారు. విగ్రహారాధన చేయడాన్ని ఖండించారు. ఆఖండానందము పొందాలి అంటే ఆధాత్మిక చింతన, భగవంతుని ధ్యానము ఉన్నతమైన మంచి మార్గములని తెలియచేసారు.

రాయ్ బిరుదులు :

బ్రిటిష్ వారు చేపట్టిన సాంఘిక సంస్కరణలు, ఆధునిక విద్యా సంస్థల ఏర్పాటును స్వాగతించారు. కానీ బ్రిటిష్ ప్రభుత్వం పత్రికల స్వాతంత్య్రంపై పరిమితులుపెట్టడాన్ని, భారతీయులను ఉన్నత పదవులకు దూరంగా ఉండేలా చేయడాన్ని వ్యతిరేకించారు. కలకత్తాలో హిందూ కళాశాల స్థాపించడం కోసం బాగా ప్రయత్నించారు. రాజారామోహన్ ఇంగ్లాండ్ వెళ్లడానికి ముందే మొఘల్ చక్రవర్తి ‘రాజా’ అనే బిరుదునిచ్చారు. రాయ్ కి ఆధునిక భారతదేశ పితామహుడు, పయనీర్ ఆఫ్ న్యూ ఇండియా అని భారత పునరుజ్జీవనోద్యమ పితామహుడు బిరుదులతో పాటు నవయుగ వైతాళికుడు, ప్ర‌వ‌క్త అని అనేక రకాల బిరుదులూ ఇవ్వబడినవి.

రాయ్ పత్రికలు:

1822 వ సంవత్సరం లోరాజా రామోహన్ రాయ్ మిరాత్ – ఉల్ – అక్బర్‌ అను పత్రికను మొదలుపెట్టారు . ఇది భార‌త్‌లోనే పర్షియన్ భాష‌లో వచ్చిన తొలి పత్రిక గా గుర్తించబడిం ది.సంవాద కౌముది ప‌త్రిక‌ను 1821 సంవత్సరం లో బెంగాలీలో నెలకొల్పారు. ఇది భారత్‌లోఒక భారతీయుడు స్థాపించిన మొట్టమొదటి పత్రిక గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ పత్రిక సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పనిచేసింది . సతీసహగమనం, విగ్రహారాధనకు వ్యతిరేకంగా పనిచేసింది. బంగదూత అనే పత్రికను రాజా రామ్మోహన్‌రాయ్ బెంగాల్, హిందీ, పర్షియా, ఇంగ్లిష్ ఈ 4 భాషల్లో ప్రచురించడం జరిగింది. బ్రాహ్మణ సేవధి అనే బ్రాహ్మణ పత్రికను ప్రచురించి అందులో క్రైస్తవ మతంలో ఉన్న లోపాలను ఎత్తిచూపడం జరిగింది. రాజా రామ్మోహన్‌రాయ్‌ 1820 వ సంవత్సరం లో ది ప్రాస్పెక్ట్స్ అఫ్ జీసస్ (ఆంగ్లం ),ది గైడ్ టు పీస్ అండ్ హ్యాపీనెస్ (ఆంగ్లం )ను సంక‌ల‌నం చేయడం జరిగింది. తహజల్ అద్-ముహుద్దీన్ (పర్షియా)లో సంక‌న‌లంచేయడం అనేది జరిగింది. 1820 వ సంవత్సరం లో ‘ ది గైడ్ టు పీస్ అండ్ హ్యాపీనెస్ ‘గ్రంథం గురించి సెరంపూర్ లోని బాపిస్ట్ మిషనరీతో వివాదం రగులుకుంది. తరువాతి క్రమంలో విలియం ఆడం అనే బాప్టిస్ట్ మతాచార్యుడు ఏకేశ్వర వాదాన్ని స్వీకరించడం జరిగింది.

ఫ్రెండ్లి అసోసియేషన్:

1815 వ సంవత్సరం లోరాజారామ్మోహ‌న్‌రాయ్ బెంగాల్‌లో ఆత్మీయ స‌భ ను స్థాపించడం జరిగింది. దీనికి ఫ్రెండ్లి అసోసియేషన్ అని మరోపేరు కూడా ఉంది .ఆ ఆత్మీయసభనే తరువాతి కాలంలో బ్రహ్మసమాజ్ గా మారడం అనేది జరిగింది. 1828 వ సంవత్సరం లో దీని మొదటి సమావేశం జరగగా దాని కార్య‌ద‌ర్శిగా తారాచంద్ర చక్రవర్తి పనిచేసారు . 1830 వ సంవత్సరం లో బ్రహ్మసమాజ సభ్యుల ఆరాధనల కొరకు బ్రహ్మమందిరం నిర్మాణం చేయడం జరిగింది. రామచంద్ర విద్యా వాగీశుడు బ్రహ్మసమాజం ప్రార్థన సమావేశాలను నిర్వహించడం జరిగింది.

సతీసహగమన నిషేధ చట్టం:

రాజా రామ్మోహన్ రాయ్ సతీసహగమనంనకు వ్యతిరేకంగా విశేషం గా పోరాటం చేయడం అనేది జరిగింది. ఆయన చేసిన పోరాటం ఫలితంగా 1829 వ సంవత్సరం డిసెంబర్ 4న బ్రిటీష్ గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్ సతీసహగమన నిషేధ చట్టం చేసారు. రామ్మోహ‌న్ రాయ్‌ ఏకేశ్వరోపాసన గురించి తెలియ చేస్తూ విగ్రహారాధనను వ్యతిరేకించారు.ఏకేశ్వరోపాసనను ప్రోత్సహించడం కోసం బ్రహ్మసమాజంలో సమావేశాలు ఎక్కువగా జరుగుతూ ఉండేవి. దీనివల్లనే బ్రహ్మసమాజను ఏక భగవానుని సమాజం అనికూడా పిలుస్తూ ఉండేవారు.స్త్రీ విద్య వలన సమాజం బాగుపడుతుంది అని విస్తృతం గా ప్రచారం చేసి చైతన్యం తీసుకువచ్చారు. పాలనలోస్త్రీలు కూడా పాల్గొనడాన్ని, ఇంగ్లీష్ చదువులను ప్రోత్సహించడం తో పాటు వితంతు వివాహాలను అమలు చేసిన వీరుడు. అదే విధానం లో బాల్య వివాహాలను సైతం ఆపడం లో విజయం సాధించారు.

ఇంగ్లీష్ భాష:

రామ్మోహన్ రాయ్ ఈస్టిండియా కంపెనీలో ఉద్యోగిగా పనిచేసే కాలంలో జాన్ డిగ్బీకి సన్నిహితం గా ఉండిఇంగ్లీష్ భాషను నేర్చుకోగలిగాడు. విద్యాభివృద్ధిలో రాజా రామ్మోహన్ రాయ్ తో కలిసి డేవిడ్ హ్యూరే , అలెగ్జాండర్ డఫ్ అనేవారు విస్తుతం గా ప‌ని చేసారు. రాయ్ వీళ్ల‌తో క‌లిసి బెంగాల్‌లో అనేక ఆంగ్ల పాఠశాలలనునెలకొల్పారు. 1822 వ సంవత్సరం లో ఆంగ్లో హిందూ పాఠశాలనుప్రారంబించారు.వేదాంత కళాశాల మరియు ప్రార్ధనా మందిరాల ను 1825లో ఏర్పాటు చేయడం జరిగింది. భారత సమాజంలో పాశ్చాత్య భావాలను పెంచడానికి ఎన్నోరకాలుగా ప్రయత్నించారు .

ఉపనిషత్తులను బెంగాలీ భాష లోకి :

వేదాలు, ఉపనిషత్తులు మాత్రమే ఏకేశ్వరోపాసనను గురించి చెబుతున్నాయంటూ కొన్ని శ్లోకాలను 5 ఉపనిషత్తులను బెంగాలీ భాష లోకి అనువదించి తన వార్తా పత్రికలో ప్రచురించుకునేవారు.వ సంవత్సరం లో నేపూల్స్ తిరుగుబాటు విఫలం కావడం తో తన సమావేశాలను రద్దు చేసుకొని ఒకరోజంతా ఉపవాసంను చేసారు. 1823వ సంవత్సరం లో దక్షిణ అమెరికాలో స్పానిష్ తిరుగుబాటు విజయవంతం అయిన కారణం గా ప్రజావిందును ఇచ్చారు. మొగల్ చక్రవర్తి రెండో అక్బర్ తన పెన్షన్ పెంపుదల కోసం అని రాయ్‌ను రాయబారిగా ఇంగ్లాండ్ కు పంపించడం జరిగింది. సముద్రయానం చేసిన తొలి బ్రాహ్మణుడు రాజా రామ్మోహన్ రాయ్ అని కూడా చెప్పుకునేవారు.

మొట్టమొదటి భారతీయుడు:

లండన్ ను సందర్శించిన మొట్టమొదటి భారతీయుడు రాజారామ్మోహన్ రాయ్. 1830 వ సంవత్సరం లో ఇంగ్లాండు చేరుకున్న ఆయ‌న‌ ఆ దేశ రాజు 4 విలియంను కలుసుకోవడం జరిగింది. రాయ్ మరణించిన తర్వాత దేవేంద్రనాథ్ ఠాగూర్, కేశవ చంద్రసేన్‌ నానాటికి క్షీణిస్తున్న బ్రహ్మ సమాజాన్ని తిరిగి పునరుద్ధరించారు.

కౌముది కీలక పాత్ర :

1815 వ సంవత్సరం లో బెంగాల్‌ సివిల్‌ సర్వీస్‌లో దివాన్‌గాపదవీ విరమణ చేసిన రాయ్‌ సతీ సహగమనం నిషేధం, పత్రికా స్వేచ్ఛలే లక్ష్యంగా కృషి చేయడం జరిగింది . ఇందుకోసమే ఆయన జర్నలిస్ట్‌ కూడా అయ్యారు. అయన స్తాపించిన పత్రికతో దేశంలో సామాజిక, రాజకీయ అంశాలపై నిర్దిష్ట ఆలోచనలకు ప్రాతినిధ్యం వహించిన పత్రిక ఇది . దీనితో మతపరమైన చర్చలు జరగడానికి శ్రీకారం చుట్టారాయన. ఆ రోజులలో క్రైస్తవ మిషనరీలు నిర్వహించే ‘సమాచార దర్పణ్‌’ హిందూ మతాన్ని విధానాన్ని విమర్శించేది. వీటిని ఖండించడంలో రాయ్ స్థాపించిన సంబాద్‌ కౌముది కీలక పాత్ర పోషించింది. అటు తరువాత సతీ సహగమనం దురాచారం, మత సంస్కరణల ప్రచారానికి రాయ్‌ ‘మిరాతుల్‌ అక్బర్‌ అనే పర్షియన్ వారపత్రికను ప్రారంభించారు. ఇది సంప్రదాయ హిందూ సమాజాన్ని ఎంతగానో కలవర పెట్టింది. భారతీయ సమాజాన్ని సంస్కరించేందుకు ఉద్దేశించిన రాతలే అయినా కూడా , అవి తమ ఉనికికి భంగం వాటిల్లే విధం గా చేసేవిగా ఉన్నాయని ఈస్టిండియా కంపెనీ భావించింది. దీని ఫలితమే 1823 నాటి ప్రెస్‌ లైసెన్సింగ్‌ చట్టం అని అంటారు. దీని ప్రకారం పత్రిక ఏదైనా ప్రచురణకు గవర్నర్‌ జనరల్‌ అనుమతి తప్పని సరిగా మారింది. అదే విధం గా ఇచ్చిన అనుమతిని వెనక్కు తీసుకునే అధికారం కూడా వారికీ ఉండేది. ఇందుకు నిరసనగా రాయ్‌ ‘మిరాతుల్‌ అక్బర్‌’ ప్రచురణను నిలిపివేయడం అనేది జరిగింది. ప్రెస్‌ రెగ్యులేషన్‌ చట్టం మీద తన వాదనను సుప్రీం కోర్టుకు కూడా ఆయన విన్నవించారు. కానీ కోర్టు ఆ విన్నపాన్ని తోసిపుచ్చడం వలన రాయ్‌ లండన్‌లోని కింగ్‌ ఇన్‌ కౌన్సిల్‌కు విన్నవించారు. హిందూ వేదాంతం మీద దాడి చేయడం కాకుండా, దానిని ఖండిస్తూ రాయ్‌ ఇచ్చిన వివరణలను ప్రచురించడానికి కూడా సమాచార దర్పణ్‌ ఒప్పుకోలేదు. దీనితో రాయ్‌ ‘బ్రాహ్మనికల్‌ మ్యాగజైన్‌’ను ఇంగ్లిష్, బెంగాలీ భాషలలో ప్రారంబించారు.

సహగమనాన్ని చూసి చలించి పోయారు:

రాయ్ తన వదినగారి సహగమనాన్ని చూసి చలించి పోయారు. ఒక్క 1818 వ సంవత్సరం లోనే 544 మందిని సహగమనం పేరిట సజీవ దహనం చేశారు. ఈ అంశం మీద ఆయన పోరాటం విజయవంతమైంది. అంతటి దురాచారాన్ని వేళ్ళతో సహా పీకేసిన మహానుభావుడు.

రాయ్ మరణం :

బ్రిటన్ పర్యటనలో ఉండగానే మెదడువాపు వ్యాధితో 1833 వ సంవత్సరం సెప్టెంబర్ 27న బ్రిస్టల్ నగరంలో రాయ్ మరణించడం జరిగింది. ఇటీవల బ్రిటిష్ ప్రభుత్వం బ్రిస్టల్‌లోని ఓ వీధికి ‘రాజా రామ్మోహన్ వే’ అని పేరు పెట్టింది.అయన స‌మాధి ఇంగ్లండ్‌లోని ఆర్నోస్‌వేల్‌లో ఉంటుంది.