Shakuni Mama : శకుని మామ కౌరవులకు మిత్రువా.. లేక శత్రువా..!!

Shakuni Mama : శకుని మామ తెలివికి నిదర్శనం, వ్యూహాలు పన్నడంలో అతనికి అతనే సాటి, అతని కుతంత్రాలకు ఎంతటివారైనా బాధ్యులు కావాల్సిందే. మహాభారతంలో అంతటి నరమేధానికి కారణమైన కురుక్షేత్ర యుద్దానికి ప్రాణం పోసినది ఇతనే. ఇతనిని భాగవతంలో తంత్ర కుతంత్ర, జిత్తుల మారి నక్కతో పోలుస్తారు. ఇతని రాజకీయ ఎత్తుగడలకు ఎంతటి పేరు ఉందో మనందరికీ తెలుసు. అయితే శకునిని కౌరవ పక్షపాతి అని అందరూ అర్థం చేసుకుంటారు.కానీ శకుడు కౌరవ పక్షపాతి కాదు పాండవ పక్షపాతి కాదు. శకుని కురు వంశాన్ని మొత్తాన్ని నాశనం చేయాలని కౌరవుల చెంత చేరుతాడు. భీష్ముని మీద పగబట్టి కురు వంశాన్ని నాశనం చేయాలని కోరుకున్న మొదటి వ్యక్తి.అందుకే అంతటి కురుక్షేత్ర యుద్ధం జరిగే లాగా కౌరవులను ప్రోత్సహిస్తాడు. అసలు కురువంశం మీద శకుని అంత పగ ఎందుకు పెంచుకున్నాడో తెలుసుకుందాం.. శకుని గాంధార రాజైన సుభల యొక్క 100వ సంతానం. ఈ గాంధార రాజ్యం ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లోని కాందహర్ గా పిలువబడుతున్నది.

శకునికి 99 మంది సోదరులు, ఒక సోదరి ఉన్నది. ఆమెనే దృతారాష్ట్రుడి భార్యయిన గాంధారి. శకుడూ చిన్నప్పటినుంచి యుద్ధ తంత్రాలు, రాజనీతి ఎత్తుగడలు వేయడంలో, జూదం ఆడడంలో ప్రజ్ఞాశాలి. అందరి కన్నా భిన్నంగా ఆలోచించి ఎదుటి వ్యక్తి యొక్క ఎత్తులను చిత్తు చేసేవాడు. సుభల యొక్క 100మంది సంతానంలో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరుచుకున్నాడు.సుభల యొక్క ఏకైక కూతురైన గాంధారికి పెళ్లి చేసే యుక్తవయసు వచ్చింది. శకునికి చెల్లెలైన గాంధారి అంటే చాలా ప్రేమ. గాంధారికి పెళ్లి చేయాలని సుబల నిర్ణయించినప్పుడు ఆమెకు కుజ దోషం ఉందని తెలిసింది. ఈ కుజ దోషం పోవాలంటే గాంధారికి ఒక మగ మేకకు పెళ్లి చేయాలని పండితులు చెబుతారు. ఆమెకు ఒక మగ మేకకు ఇచ్చి పెళ్లి చేసి ఆ మేకను బలి ఇస్తారు.ఈ విషయం తెలిస్తే పరువు పోతుంది అని భావించి ఎవరికీ తెలియ కుండా గాంధారికి పెళ్లి చేయడానికి ఇతర రాజ్యాలకు సందేశం పంపుతాడు. దీనితో ధృతరాష్ట్రుడు తల్లి అయినా అంబికా దేవి గాందారి అందానికి ముగ్ధురాలై ధృతరాష్ట్రునికి ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించి..

Shakuni Mama is a friend or foe to the Kauravas
Shakuni Mama is a friend or foe to the Kauravas

సుభలకు వర్తమానం పంపుతుంది. కానీ సుబల దృతరాష్ట్రడు గుడ్డివాడు అవడంతో ఆ వర్తమానంను తిరస్కరిస్తాడు. దీనిపై ఆగ్రహం చెందిన అంబిక గాంధారా రాజ్యంపై యుద్ధం ప్రకటించి, గాంధారిని తీసుకురమ్మని భీష్మునికి చెబుతుంది. కానీ భీష్మడు ఇలా చేయడం పాపం అని చెబుతాడు. అంబికా తనకు ఇచ్చిన వరం ఇప్పుడు వాడుకుంటున్నా, ఆ వరం మీరు ఇప్పుడు నెరవేర్చండని భీష్ముడి ని అడుగుతుంది. దాంతో భీష్ముడు గాంధార రాజ్యం పై దండెత్తి గాంధారి ని దృతారాష్ట్రుడికి ఇచ్చి వివాహం చేస్తారు. అప్పుడు శకుడు ఒక పన్నాగాం పన్నుతాడు. దృతారాష్ట్రుడు గుడ్డి వాడు కనుక అతనిని అడ్డు పెట్టుకొని హస్తినాపురాన్ని తన వశం చేసుకోవచ్చు,అలాగే భీష్ముణ్ణి పై పగ తీర్చుకోవచ్చని భావిస్తాడు. ఇలా కొద్ది రోజులు గడిచిన తర్వాత గాంధారి మొదటి వివాహం గురించి ధృతరాష్ట్రుడికి అసలు విషయం తెలుస్తుంది. ధృతరాష్ట్రుడుకి కోపం వచ్చి గాంధార రాజైన సుబలను, అతని వంద మంది కుమారులను ఒక చిన్న గదిలో బందించి రోజుకు ఒక్కొక్కరికి ఒక మెతుకు అన్నం పెట్టేవాడట. ఇలా ఒక్కొక్కరు ఒక మెతుకు ఏమీ చాలదని అన్ని మెతుకులు కలిపి ఒకరికి పెట్టి వారిని బతికించాలని నిర్ణయిస్తారు.

Shakuni Mama is a friend or foe to the Kauravas
Shakuni Mama is a friend or foe to the Kauravas

అందరి కంటే తెలివైన వాడు శకుడు అయినందువల్ల అందరూ కలసి అందరి భోజనం శకునికి తినిపిస్తారు. దీనితో అందరూ ఆకలితో చనిపోయినా.. శకుడు మాత్రం బతుకుతాడు. సుబలా తను చనిపోయిన తరువాత తన వెన్నెముకతో పాచికలు చేసుకొమ్మని, నీ మనసులో ఏది తలిస్తే అది పడుతుందని చెబుతాడు. శకుడు ఈ విషయం భవిష్యత్తులో మర్చిపోకుండా శకునికి ఒక కాలు విరిచి అవిటి వాడిని చేస్తారు.గాంధారి తన సోదరుడు ఒక్కడే బ్రతికివున్నాడని, శకునిని వదిలేయమని, ధృతరాష్ట్రుడుకి విన్నవించుకుంటుంది. అందుకు ధృతరాష్ట్రుడు అంగీకరించి శకున్ని వదిలేసి గాందార రాజ్యానికి వెళ్లిపొమ్మని చెబుతాడు.కానీ శకుడు కురువంశం నాశనం చేయడానికి ప్రతిజ్ఞ పూని, తన మేనల్లుళ్లను చూసుకుంటూ ఇక్కడే ఉంటానని, కౌరావుల చెంత చేరుతాడు.శకుడు కురు వంశలో పాండవులకు, కౌరవులకు మధ్య తగాదాలు పెడుతూ, అంతటి కురక్షేత్ర సంగ్రామం జరిగేలా చేసి, చివరికి కురువంశం నాశనం అయ్యేలా చేసాడు. ఇక మొత్తంగా చూసుకుంటే శకుని మామ కౌరవులకు శత్రువు అనే చెప్పాలి.