Health Benefits : రోజు చూసే ఈ మొక్క గురించి ఎవ్వరికీ తెలియని నిజాలు..!

Health Benefits : మెరిసే బంగారు రంగు పూలు.. ముట్టుకొని ముళ్ళు.. చిక్కితే పచ్చని పాలు.. ఆవల్లాంటి గింజలు.. బహుశా ఈ మొక్కను చూడని వారు ఉండరు.. కాకపోతే దీని పేరే తెలియకపోవచ్చు.. ఇంత చక్కటి పూలున్న ఈ మొక్క పేరు పిచ్చికుసుమ..! దీనిని బలురక్కసి, స్వర్ణ క్షీరి, బ్రహ్మదండి, వెర్రి కుసుమ అని కూడా పిలుస్తారు..! పిచ్చి కుసుమ మొక్కను సమూలంగా వేర్లతో సహా తీసుకొని దంచి రసం తీసుకోవాలి. ఈ ఆకుల రసానికి సమాన మోతాదులో నువ్వులనూనె కలపాలి. దీనిని పొయ్యి మీద పెట్టి మరిగించాలి. నూనె మాత్రమే మిగిలే వరకు మరిగించాలి. ఆ తర్వాత ఒక గాజుసీసాలోకి నూనె ను వడపోసుకోవాలి.ఈ నూనె ను నిల్వ చేసుకుని ప్రతిరోజు ఉపయోగించుకోవాలి.

ఈ నూనె గజ్జి, తామర, దురద ఉన్నచోట రాసుకుని మసాజ్ చేసుకుంటే అవి త్వరగా తగ్గిపోతాయి. ఈ మొక్క పెయిన్ కిల్లర్ లాగా పనిచేస్తుంది. మూత్రం సరిగా రాకపోవడం, మూత్రంలో ఇన్ఫెక్షన్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఈ మొక్కలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ జలుబు, దగ్గు ను తగ్గిస్తుంది. కడుపులో నులిపురుగులు పోగొడుతుంది. ఈ చెట్టు ఆకులను తెలిస్తే పాలు వస్తాయి చర్మవ్యాధులు ఉన్నచోట ఈ పాలు రాత్రి త్వరగా మానిపోతాయి ఈ చెట్టు ఆకులను దంచి రసం తీసి పుండ్లు ఉన్నచోట్ల రాస్తే త్వరగా మానిపోతాయి. కుష్టి వ్యాధికి కూడా చెట్టు ఆకులు పనిచేస్తాయి.

Health Benefits Of Pichi Kusuma Plant
Health Benefits Of Pichi Kusuma Plant

ముద్దగా నూరి ఆ మిశ్రమాన్ని కళ్ళకి కాటుక పెట్టుకుంటే కామెర్ల వ్యాధి నయమవుతుంది. ఇంకా ఎన్నో రోగాలను నయం చేస్తుంది. శృంగార సమస్యల నుంచి విముక్తి చేస్తుంది. ఈ చెట్టు విత్తనాల నుంచి తీసిన నూనె శరీరంపై లేపనం చేసుకుంటే అనేక రకాల రుగ్మతలను నయం చేస్తుంది. మైగ్రేన్ తలనొప్పి లకు కిడ్నీ వ్యాధులకు ఇది ఔషధంగా పని చేస్తుంది. మత్తు మందుగా కూడా ఈ మొక్కను ఉపయోగిస్తారు. అయితే ప్రత్యేకంగా వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వాడవలసిన ప్రమాదకరమైన మందు ఇది.