Money : ఈ వస్తువులతో ధనప్రాప్తి కలుగుతుందట.. ఎలా అంటే..?

Money : హిందూ సాంప్రదాయం ప్రకారం పురాతన కాలం నుంచి బహుమతులు ఒకరికొకరు ఇచ్చుకోవడం ఆనవాయితీగా వస్తున్న విషయం అందరికీ తెలిసిందే.. ఇక సాధారణంగా ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా తమకు నచ్చిన వారికి లేదా ఇష్టమైన వారికి ఏదో ఒక రూపంలో కానుకలను ఇస్తూ ఉంటారు. ఇక పెళ్లిళ్లు, పెళ్లి వార్షికోత్సవం, పుట్టినరోజు, లవర్స్ డే , ఫాదర్స్ డే, మదర్స్ డే ఇలా ప్రతి చిన్న సందర్భానికి కూడా ఒకరికొకరు బహుమతులు అనేవి ఇచ్చుకుంటారు.. ఇప్పుడు చెప్పబోయే కొన్ని వస్తువులను ఇచ్చినా లేదా తీసుకున్నా రెండింటి వల్ల కూడా ఆర్థిక ప్రయోజనం కలుగుతుంది అని వాస్తు శాస్త్రం చెబుతోంది..

నిజానికి ఎవరికైనా బహుమతులు ఇచ్చినప్పుడు ఖర్చు అవుతుంది కదా అని కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఇలా బహుమతులను ఇవ్వడం వల్ల వాటి ద్వారా వచ్చే పాజిటివ్ ఎనర్జీ కారణంగా ఇంట్లో సానుకూల ప్రభావం ఏర్పడి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది.ముఖ్యంగా ఎలాంటి వస్తువులను ఇవ్వడం , తీసుకోవడం చేయాలి అనే విషయానికి వస్తే.. ముందుగా గణేశుడి విగ్రహం.. ఈ విగ్రహాన్ని జ్యోతిష్య, వాస్తు విజ్ఞాన శాస్త్రం ప్రకారం గా ఇతరులకు ఇచ్చినా లేదా స్వీకరించినా శుభప్రదమైనది అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. గణేశుడి విగ్రహం ఇవ్వలేని ఆర్థిక స్తోమత లేని వారు ఒక పటం అయినా ఇవ్వచ్చు.

Money is made with these things
Money is made with these things

ఇలా ఇవ్వడం వల్ల గణేశుడు అనుగ్రహంతో జీవితంలో కష్టాలు అన్ని తొలగి పోయి ఆ ఇంట్లో సుఖ శాంతులు వెల్లు విరుస్తాయి.హిందూ సంప్రదాయం ప్రకారం ఏనుగు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా ఏనుగు గణేషుడి వాహనం కాబట్టి ఏనుగు బొమ్మను బహుమతిగా ఇచ్చినా లేదా తీసుకున్నా కూడా చాలా శ్రేయస్కరం. ముఖ్యంగా వెండి, ఇత్తడి, చెక్కతో తయారు చేసిన ఏనుగు బొమ్మలు బహుమతిగా ఇస్తే మరీ మంచిది .. ఇక ఎట్టి పరిస్థితుల్లో కూడా గాజుతో తయారు చేసిన బొమ్మలను ఎవరికీ బహుమతులుగా ఇవ్వద్దు. గుర్రం, వెండి వస్తువులు , దుస్తులు లాంటివి కూడా ఇతరులకు బహుమతులుగా ఇవ్వవచ్చు.