Womens : ఈ రోజు పొరపాటున కూడా ఆడవారు ఈ పనులు చేయకండి..!!

Womens : నేడు అర్ధరాత్రి 12:30 గంటల తర్వాత శని అమావాస్య సూర్య గ్రహణం రాబోతున్న తరుణంలో మహిళలు ముఖ్యంగా కొన్ని పనులను అస్సలు చేయకూడదు. ఇక తెల్లవారుజామున 4:08 గంటల వరకు సూర్య గ్రహణం కొనసాగుతుంది. చైత్ర అమావాస్య రోజు సూర్య గ్రహణం ఏర్పడుతున్న కారణంగా ఈరోజు ప్రత్యేకమైన రోజుగా భావించడం జరుగుతోంది. ఈ సంవత్సరానికి గాను మొత్తం నాలుగు సూర్య గ్రహణాలు ఏర్పడుతున్నాయి. అందులో మొదటిది ఈరోజు ఏర్పడబోతోంది. ఈ సూర్యగ్రహణం కారణంగా కొన్ని రాశుల వారిపై ప్రత్యేక ప్రభావం పడుతోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహణం మంచిది కాదు కాబట్టి ఈరోజు దేవాలయాలన్నీ మూసివేయబడతాయి.

ఈరోజు చైత్ర అమావాస్య కాబట్టి పితృ దోషం పోగొట్టుకోవడానికి సరైన గడువు అని చెప్పవచ్చు. అమావాస్య రోజు దాన ధర్మం, నదీ స్నానం చేయడం వల్ల పుణ్యం కలుగుతుంది. గంగాజలం కలిపిన నీటితో స్నానం చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టి … మిగిలినది కాకికి, కుక్కకి , ఆవుకి వేయడం వల్ల దోష పరిహారం జరుగుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. సూర్య గ్రహణం సమయంలో ఆడవారు అసలు బయటకు వెళ్లకూడదు. గర్భిణీ స్త్రీలు ఇంట్లోనే ఉండాలి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు సూర్య గ్రహణం ఏర్పడటానికి ముందు అయిపోయిన తర్వాత కచ్చితంగా స్నానం చేయాలి.పదునైన వస్తువులను, పిన్నులు, ఆభరణాలు, దేవతా విగ్రహాలు లాంటివి అస్సలు ముట్టుకోకూడదు. ఇక సూర్య గ్రహణం సమయంలో మద్యం , మాంసాహారం లాంటివి చేయకూడదు.

Womens should not do these things even by mistake today
Womens should not do these things even by mistake today

మరీ ముఖ్యంగా ఆడవారు సూర్యగ్రహణం సమయంలో దేనిని కూడా తినకూడదు. ఇక ఈ రోజు నేరుగా సూర్యుడిని చూడకూడదు. ఒకవేళ చూసినట్లయితే సూర్యుని యొక్క అతినీలలోహిత కిరణాలు కంటి పై పడి దృష్టి పై ప్రభావం పడుతుంది. ఇలాంటి పనులు మాత్రం అస్సలు చేయకండి. ఒకవేళ చేస్తే మీ సమస్యలు మరింత రెట్టింపు అవుతాయి. చిన్న పిల్లలను బయటకు వెళ్లనివ్వకుండా చూసుకోవాలి. సూర్యకిరణాలు ఇంట్లో ఉండే దేవుడి పటాలపై పడకుండా తలుపులు , కిటికీలు మూసి వేయాలి. ఇలాంటి కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అంతా శుభం కలుగుతుంది. ఇక మీ ఇంట్లో ఆడవారికి తప్పకుండా ఈ ఆర్టికల్ను వాట్సాప్ లేదా ఫేస్ బుక్ ద్వారా షేర్ చేయండి.