Shani Amavasya : దుష్ప్రభావాలు పోయి సంపద పెరగాలంటే.. శని అమావాస్య రోజు ఇలా చేయండి..!!

Shani Amavasya : హిందూ సాంప్రదాయం ప్రకారం ఎన్నో విషయాలు మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అందులో భాగంగానే హిందూ క్యాలెండర్ రీత్యా అమావాస్య ప్రతి కృష్ణ పక్షం చివరి తేదీన వస్తుంది . ఈసారి అమావాస్య శనివారం కావడం విశేషం.. అందులోనూ అమావాస్య శనివారం రావడం తో ఒక రకంగా పండితులు అశుభం అని చెబుతున్నారు. మరికొంతమంది అమావాస్య ప్రాధాన్యత మరింత పెరిగింది అని కూడా చెబుతున్నారు. ఇక ఈ అమావాస్య ఏప్రిల్ 30 శనివారం రోజు వస్తోందని, శని అమావాస్య గా పిలవడం జరిగింది. అయితే జ్యోతిష్య శాస్త్రం పరంగా కొన్ని నివారణ చర్యలు చేపట్టడం వల్ల శని దేవుని అనుగ్రహం పొందవచ్చట.

సాధారణంగా పక్షి , ఇతర దోషాలను తొలగించడంలో దాన కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. కేవలం శని అమావాస్య రోజు మాత్రమే కాకుండా నెలలో వచ్చే ఏ అమావాస్య రోజున అయినా సరే మనం కూడా కొన్ని నియమాలు పాటించడం వల్ల అనేక సమస్యలు పొందడమే కాకుండా సంపద కూడా పెరుగుతుంది. ఇందుకోసం రావి చెట్టుకు పూజ చేయాలి. శని అమావాస్య రోజు ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రపరిచి.. మీరు కూడా స్నానం చేసి రావి చెట్టు వద్దకు వెళ్ళాలి. వెళ్లేటప్పుడు నల్లనువ్వులు , ఇనుప గోరు , ఆవాల నూనె, మట్టి దీపం తీసుకువెళ్ళండి. చెట్టుని పూజించే ముందు చెట్టు చుట్టూ పాదులు చేసి ఆపై చెట్టుకు నువ్వులు , ఆవాలు, ఇతర పూజా సామాగ్రి సమర్పించాలి.

If the side effects are to go away and wealth to grow
If the side effects are to go away and wealth to grow

ఇక మట్టి దీపం లో దీపం వెలిగించి శని దేవుని ప్రసన్నం చేసుకోవడం వల్ల మన పై వున్న శని చెడు ప్రభావం దూరం అవుతుంది.ఇక శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి శని అమావాస్య రోజు నల్ల నువ్వుల నూనె , అలాగే నల్లనువ్వులు సమర్పించాలి. ఆలయంలో శని చాలీసా చదవడం వల్ల శని యొక్క చెడు ప్రభావం మీ నుంచి దూరంగా పోతుంది . అంతే కాదు బెల్లంతో తయారుచేసిన పదార్థాలను కూడా దానం చేయడం వల్ల శని ఆగ్రహానికి మనం గురికాకుండా ఉంటాము. అంతే కాదు ఇలా చేయడంవల్ల ఏలినాటి శని ప్రభావం కూడా తొలగించుకోవచ్చు. మీకు తెలిసిన ఎవరైనా ఇలా ఏలినాటి శనితో బాధపడుతున్నట్లయితే వారికి ఈ ఆర్టికల్ ను వాట్సప్ లేదు ఫేస్ బుక్ ద్వారా షేర్ చేయండి.