Desires: కోరికలు నెరవేరాలంటే ఈ పూలతో పూజిస్తే సరి..!

Desires: మనిషి అన్న తర్వాత కోరికలు కలగడం సహజం.. అంతేకాదు ఆ కోరికలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేయడంతో పాటు కోరికలను నెరవేర్చుకున్నప్పుడు మనిషి తన జీవితంలో సంతోషాన్ని పొందుతారు. ఇకపోతే కోరికలను నెరవేర్చుకోవడానికి కష్టపడితే చాలదు.. అందుకు తగ్గట్టుగా దేవుడు సహాయం కూడా ఉండాలి. ఇక దేవుడిని అలంకరించేటప్పుడు రకరకాల రంగురంగుల పూలతో దండ గుచ్చి దేవుడిని అలంకరిస్తారు. ఆ మాలను స్వామివారి పాదాల దగ్గర ఉంచి నమస్కరించుకుంటాము. ముఖ్యంగా ఒక్కో దేవుడికి ఒక్కోరకం పువ్వు అంటే ప్రత్యేకమైన ఇష్టం కూడా ఉంటుంది.


1. మందార పువ్వు:
మందార పూలను ముఖ్యంగా కాళికామాత కు సమర్పించి పూజ చేయడం వల్ల అమ్మవారు సంతోషిస్తారు అట.  అంతేకాదు 108 మందార పూలను తెచ్చి.. దండగా గుచ్చి అమ్మవారి పాదాల ముందు  పెట్టి పూజిస్తే మనసులో కోరికను కోరినప్పుడు కచ్చితంగా అమ్మవారు అనుగ్రహిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

2. పారిజాత పుష్పం:
పురాణాల ప్రకారం క్షీరసాగర మధనం చిలికినప్పుడు ఈ పారిజాత వృక్షం పుట్టుక వచ్చిందట . అందుకే శ్రీ మహా విష్ణువు కి పారిజాత పుష్పం అంటే ఎంతో ప్రీతి.. ముఖ్యంగా పారిజాత పూలను విష్ణుమూర్తికి సమర్పించి పూజించడంవల్ల ఆయన అనుగ్రహం మనపై ఉంటుందట.


3. బంతి పువ్వు:
బంతి పువ్వు కూడా మనకు రకరకాల రంగులలో లభిస్తుంది. ముఖ్యంగా ఆరెంజ్ కలర్లో ఉండే బంతిపూలను  వినాయకుడి పూజలో సమర్పించి పూజ చేయడం వల్ల విఘ్నాలను తొలగించి అన్ని శుభాలను కలిగిస్తాడట వినాయకుడు. ముఖ్యంగా దేవతలందరిలో ఆది దేవుడు వినాయకుడు కాబట్టి కచ్చితంగా బంతిపూలతో పూజ చేస్తే మన కోరికలు నెరవేరుతాయట.


4. పలాశ పువ్వు:
చాలా అరుదుగా కనిపించే సరస్వతీదేవికి చాలా ఇష్టం. ఎవరైతే విద్యలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆలోచిస్తున్నారో అలాంటి వారు ముఖ్యంగా సరస్వతి దేవి కి ఈ పూలను సమర్పించడం వల్ల తప్పకుండా అమ్మవారు అనుగ్రహం లభిస్తుంది అని చదువులో ఆటంకాలు ఉండవు అని పండితులు చెబుతున్నారు.

ప్రతి ఒక్కరూ తమ కోరికలను నెరవేర్చుకోవడానికి ఏవేవో చేస్తుంటారు. కాబట్టి ఈ ఆర్టికల్ ను వారికి వాట్సప్ ద్వారా షేర్ చేసి దైవబలం కూడా చేకూరడానికి తోడ్పడండి.