Nagakesari: ఈ పువ్వుతో ఇలా చేస్తే లక్ష్మిదేవి కటాక్షం మీ వెంటే..! 

Nagakesari: దైవారాధనకు మనం రకరకాల పూలను ఉపయోగిస్తుంటాం.. దేవుడికి ఇష్టమైనా పూలతో పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి.. ఆర్థిక బాధలు తొలగాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాల్సిందే.. లక్ష్మీదేవికి ఇష్టమైన పూలలో నాగకేసర పూలు కూడా ఒకటి.. ఈ పూలతో లక్ష్మీదేవి కటాక్షం ఎలా పొందాలో తెలుసుకుందాం..!
 Astro Vasthu Tips Of Nagakesari Flowers
Astro Vasthu Tips Of Nagakesari Flowers
ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నవారు ఏదైనా నెలలో శుక్లపక్షం శుక్రవారం నాడు ఒక చిన్న వెండి బాక్స్ తీసుకుని అందులో ఒక నాగకేసర పువ్వు పెట్టి తేనే వేసి మూత పెట్టాలి. ఆ వెండి బాక్స్ ను మీ బీరువాలో ఉంచితే మీకు ఆర్థిక లాభాలు రావడం మొదలవుతుంది. ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంట్లో ధనం నిలకడగా ఉంటుంది. ఇదేవిధంగా దీపావళి రోజున కూడా చేస్తే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఆ సంవత్సరం పాటు ఉంటుంది.
 Astro Vasthu Tips Of Nagakesari Flowers
Astro Vasthu Tips Of Nagakesari Flowers
నాగకేసర పువ్వులు మహాశివుడికి చాలా ఇష్టం. ప్రతి సోమవారం రోజు ఆ పరమేశ్వరుడికి పూజ చేసి ఈ పూలు సమర్పిస్తే.. మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. కార్తీక మాసంలో ఈ పూలతో శివుడికి విశేషంగా పూజలు చేస్తారు సకలాభీష్టాలు నెరవేరాలని.. నాగకేసర చెక్కతో హోమం చేయడం వల్ల ఇంట్లో సానుకూలత పెరుగుతుంది. ఇంట్లో అందరికీ ప్రేమ, ఆప్యాయత అనురాగాలు పెరుగుతాయి. సమాజంలో కీర్తిప్రతిష్టలు లభిస్తాయి. నాగకేసర మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల ఆనందం, శ్రేయస్సు, అదృష్టం కలుగుతాయి.