Billa Ganneru: రోజు మనం చూసే ఈ మొక్కతో ఎన్ని ప్రయోజనాలో చూడండి..

Billa Ganneru: బిళ్ళ గన్నేరు మొక్కను మన ఇంటి చుట్టుపక్కల చూస్తూనే ఉంటాం.. ఈ మొక్కను నిత్య కళ్యాణి, నిత్య పుష్పి అని కూడా పిలుస్తారు.. ఇవి ఎరుపు, తెలుపు రంగు పూలను కలిగి ఉంటాయి.. ఈ చెట్లు చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.. అయితే ఈ మొక్కలో బోలెడు ఔషధ గుణాలు ఉన్నాయి.. ఆయుర్వేద వైద్యంలో పూర్వకాలం నుంచి ఈ మొక్కను ఉపయోగిస్తున్నారు.. బిళ్ళ గన్నేరు మొక్కతో చాలా అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు..!
బిల్లగన్నేరు ఆకులను శుభ్రంగా కడిగి మెత్తగా దంచుకొని రసం తీసుకోవాలి. ఒక చెంచా ఈ ఆకుల రసాన్ని ఉదయం పరగడుపున తాగితే అధిక రక్తపోటు తగ్గుతుంది. ఈ ఆకుల కషాయం తీసుకుంటే రుతు సమయంలో వచ్చే నొప్పులను తగ్గిస్తుంది. అధిక రక్తస్రావం తగ్గించడంతో పాటు ఆ సమయంలో ఉండే చికాకు, వికారంను కూడా తగ్గిస్తుంది. బిల్ల గన్నేరు ఆకు లకు దానిమ్మ చెట్టు ఆకులు మొగ్గలను కలిపి మెత్తగా నూరుకోనీ రసం తీసుకోవాలి. ఈ రసాన్ని నోటిలో పోసుకొని పుక్కిలించి చేస్తే నోటి అల్సర్ లోను తగ్గిస్తుంది. చిగుళ్ల నుంచి రక్తం కారడం, నోటి దుర్వాసన రాకుండా చేస్తుంది. పిప్పి పన్ను సమస్యలను కూడా తగ్గిస్తుంది.
 బిళ్ళ గన్నేరు ఆకులలో యాంటీ సెప్టిక్ గుణాలు ఉన్నాయి. ఈ ఆకులను దంచి ముద్దగా నూరుకోవాలి. ఆ మిశ్రమాన్ని పుండ్లు, గాయాలు ఉన్నచోట రాస్తే అవి త్వరగా మానిపోతాయి. ఈ చెట్టు టెన్షన్, ఒత్తిడి ని దూరం చేసి మానసిక ప్రశాంతత ను అందిస్తుంది. ఏకాగ్రత ను పెంచుతుంది. జ్ఞాపకశక్తిని పెంపొందిస్తుంది. మెదడును ఉత్తేజపరుస్తుంది.