Devotional : ప్రత్యేకించి ఆ రోజు ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోనే..!

Devotional : ప్రస్తుతం ఆధునిక సమాజంలో బ్రతకాలి అంటే డబ్బు చాలా అవసరం. ఆ డబ్బు కోసం మనిషి ఏం చేయడానికి అయినా వెనుకాడడం లేదు. మనిషి డబ్బు సంపాదించడానికి అనేకమార్గాలను వెతుక్కుంటున్నాడు. అయితే కొంతమంది ఎంత సంపాదించినా సరే చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలట్లేదని బాధపడుతున్నారు. మరికొంతమంది ఆర్థిక సమస్యల వల్ల మరింతగా డబ్బు సమస్య ఏర్పడి కుటుంబాన్ని కూడా పోషించలేని స్థితికి చేరుకుంటున్నారు. అందుకే ఆర్థిక సమస్యల నుంచి బయట పడాలంటే ముఖ్యంగా వాస్తు శాస్త్రం ప్రకారం ప్రత్యేకించి ఆ రోజు ఇలా చేశారంటే లక్ష్మీదేవి ఇక మీ ఇంట్లోనే ఉంటుంది.

If you suffering from financial issues.. do this work only on that day..!
If you suffering from financial issues.. do this work only on that day..!

ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్న ఇంట్లో ఏం చేయాలంటే ఆదివారం రోజున ఈ ఒక్క పరిహారం చేసి చూడండి. ఆదివారం రోజు రూపాయి బిళ్ళతో కనుక పరిహారాన్ని చేసినట్లయితే మీకున్న ఆర్థిక కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. లక్ష్మీదేవి కటాక్షం కూడా కలుగుతుంది. కాబట్టి రూపాయి బిళ్ళలు అంటే ఆమెకు ఎంతో ఇష్టం.. ఆ రూపాయి బిళ్ళలను మీరు గుప్పెడు తీసుకొని వాటితో శబ్దం చేయండి. వాటితో వచ్చే శబ్దం అంటే అమ్మవారికి చాలా ఇష్టం. కార్తీక మాసంలో ప్రతినిత్యం పూజలు చేస్తూనే ఉంటాము. చాలామంది దీపారాధన చేసి శివ కేశవులు ఇద్దరినీ కూడా ఆరాధిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఉదయం, సాయంత్రం వేళలో దీపాలు పెట్టి ఆ శివకేశవులకు కూడా దీపాలు వెలిగించి మన సమస్యలు తీరిపోవాలని వేడుకుంటాము.

ఈ క్రమంలోనే పూజ చేసేటప్పుడు ఒక ఎర్రటి గుడ్డను తీసుకొని రాగి ప్లేట్లో గుడ్డను పరచాలి. తర్వాత రూపాయి బిళ్ళను పెట్టాలి. పెట్టిన తర్వాత ఆ రూపాయి బిళ్ళ మీద శ్రీ అని రాసి ఆ రూపాయి బిళ్ళను అలాగే ఎర్రగుడ్డలో చుట్టి, ఆ గుడ్డతో సహా ముడి వేయాలి. ముడి వేసేటప్పుడు మీకున్న బాధ లు చెప్పుకుంటూ ముడి వేయాలి. అలాగే దీనిని మీరు డబ్బులు దాచుకునే ప్లేస్ లో పెట్టాలి . 15 నిమిషాల పాటు ఉంచి తర్వాత తీసి ఆ ఎర్రటి క్లాత్ ను ఏదైనా పారే నీటిలో వేయాలి. ఆ రూపాయి బిళ్ళను ఏదైనా గుడిలో హుండీ లో వేయాలి. ఇలా చేసినట్లయితే మీ ఆర్థిక సమస్యలన్నీ దూరమవుతాయి. అయితే ఈ పరిహారం కేవలం ఆదివారం మాత్రమే చేయాలి గుర్తుంచుకోండి.