Karthika Deepam 07 Nov Episode : ఆ ఫోటోతో అసలు నిజం తెలుసుకున్న దీప, కార్తీక్.. మోనితకి ఝలక్ ఇచ్చిన దుర్గ..

Karthika Deepam 07 Nov Episode :  మనం ఇంద్రుడు ఇంటికి చెప్పా పెట్టకుండా సడన్ గా వెళ్దాం.. అప్పుడు మనకి శౌర్య అక్కడ ఉందో లేదో తెలిసిపోతుంది అని కార్తీక్ అంటాడు.. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ వెళుతుండగా.. ఒక కారులో శౌర్య వెళ్లడం దీప చూస్తుంది.. ఆపండి కార్ ఆపండి అని శౌర్య అంటున్న మాటలు విన్న దీప ఆ గొంతు కచ్చితంగా మా పాప శౌర్యదే డాక్టర్ బాబు. కచ్చితంగా ఆ కారులో మన శౌర్య ఉంది. ఆ కారులో నిజంగా వెళ్తుంది మన శౌర్య డాక్టర్ బాబు అని దీప అంటుంది.. రేయ్ ఆపండి అంటూ కార్తీక్ కారు వెనకమాల పరిగెత్తుతాడు.. శౌర్య చేతులు బయటకు పెడుతుంది.. ఆనందరావు హిమ ఇద్దరూ వాళ్ళ ఇంటికి వెళ్లి పోదామని శౌర్యకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తారు. నేను రాను గాక రాను అమ్మానాన్న ఇక్కడే ఏ ఊర్లోనే ఉన్నారు. వాళ్ళు దొరికాకే నేను వస్తాను అని శౌర్య అంటుంది..

karthika deepam 07 November today full episode
karthika deepam 07 November today full episode

ఆ ఇంద్రుడు చంద్రుడు వాళ్ళు నిన్ను ఏదో మాయ చేసారు శౌర్య. నువ్వు వాళ్ళ మాయలో ఉన్నావు శౌర్య. నిన్ను వాళ్ల దగ్గర నుంచి పంపించకుండా ఉండటానికి ఇలా ప్లాన్ చేశారు. నీకు ఆ విషయం అర్థం కావడం లేదు. మాతోపాటు హైదరాబాద్ వచ్చాయమ్మ శౌర్య అని ఆనందరావు నచ్చ చెబుతాడు. తాతయ్యా చెప్పే మాట విను శౌర్య అని హిమా అంటుంది నువ్వు నాతో మాట్లాడకు అని శౌర్య అంటుంది. అంతలో ఇంద్రుడు ఆ కార్ కి ఎదురుగా తీసుకువచ్చి ఆటోని ఆపుతాడు. దాంతో శౌర్య కారులో నుంచి దిగి ఇంద్రుడు దగ్గరకు వెళ్ళిపోతుంది. మీరు నన్ను మళ్ళీ మళ్ళీ కలవాలని ప్రయత్నిస్తే నేను మీకు దక్కనంత దూరంగా వెళ్తాను. ఇంకోసారి నన్ను కలవాలని ప్రయత్నిస్తే నా మీద ఒట్టే అని శౌర్య ఇంద్రుడుతో పాటు కలిసి వెళ్ళిపోతుంది.

కార్తీక్ దీపా ఇద్దరూ కలిసి సౌర్య వాళ్ళ ఇంటి దగ్గరకు వెళ్తారు. ఇంద్రుడు వాళ్ళు ఎక్కడ అని అడుగ వెళ్తున్నా ఓ వ్యక్తిని అడిగితే బయటకు ఎక్కడికో వెళ్లారు అని చెబుతారు. ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారా అని దీప అడుగుతుంది. లేదు బయటికి వెళ్లారు అని చెబుతారు. అయితే పద దీప మనం ఇక్కడి నుంచి పక్కకు వెళ్లి దాక్కుందాము అని కార్తీక్ అంటాడు అని దీప అంటుంది..

మోనిత కార్తీక్ ఎక్కడికి వెళ్లడానికి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే దుర్గా వచ్చి దీపమ్మ కార్తీక్ బాబు ఇద్దరూ కలిసి ఎక్కడికో వెళ్లిపోయారు. బహుశా లేచిపోయారేమో అని అంటాడు.. బహుశా నీ టార్చర్ తట్టుకోలేక వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు.. నీకు ఇంకో నిజం చెప్పనా మోనిత.. కార్తీక్ సార్ కి నిజం గుర్తుకు వచ్చేసింది. అందుకే దీపమ్మను తీసుకొని లేచిపోయారు అని దుర్గా మోనితకు షాకుల మీద షాకులు ఇస్తాడు దుర్గ. మౌనిత అదంతా నిజమే అని నమ్మేసిద్ది మోనిత. దుర్గ చెప్పిన విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటుంది.

రేపటి ఎపిసోడ్లో కార్తీక్ దీప ఇద్దరూ కలిసి ఇంద్రుడు వాళ్ళింటికి వెళ్తారు. అప్పటికే వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారని చెబుతారు. ఇక ఆ ఇంట్లో దీప వెతుకుతూ ఉంటుంది. చివరగా ఒక ఫోటో కనిపిస్తుంది. ఆ ఫోటో చూసి డాక్టర్ బాబు అని దీప పెద్దగా అరుస్తుంది. అందులో శౌర్య ఇంద్రుడు చంద్రమ్మ ముగ్గురు కలిసి ఉన్న ఫోటో ఉంటుంది. కచ్చితంగా మన శౌర్య వీళ్ళ దగ్గరే ఉంది డాక్టర్ బాబు అంటూ దీప ఏడుస్తుంది.